రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా థ్యాంక్యూ సీఎం నినాదంతో మారుమ్రోగింది. సీఎం జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ బోస్టన్ కమిటీ కర్నూలు జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్ గా పేర్కొనటంపై కర్నూలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, న్యాయవాదులు, ఎన్జీవోలు సీఎం జగన్ ను అభినందిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 
 
థ్యాంక్యూ సీఎం పేరుతో భారీ ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందని.. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ముఖ్యమంత్రులైనా అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడిందని.. ఇలాంటి తరుణంలో సీమ అభివృద్ధి కొరకు సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పదని కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ చేస్తే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. రెండు కమిటీల నివేదికలు జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలును పేర్కొనటంతో స్వచ్ఛందంగా విద్యార్థులు, న్యాయవాదులు ర్యాలీలో పాల్గొని థ్యాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. 
 
కర్నూలును జ్యుడీషియల్ రాజధాని చేసే అవకాశం ఉందని సీఎం జగన్ ప్రకటన చేసినప్పటి నుండి ఎన్నో సంవత్సరాల నుండి తాము కోరుకుంటున్న కల నెరవేరిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్న జగన్ ప్రకటనను వారు స్వాగతిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన రాయలసీమ వెనుకబాటుకు గురైనా జగన్ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాల వలన సీమ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నుండి ప్రకటన రావాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: