రాజధాని రగడ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.  గొడవ రానురాను పెద్దది అవుతున్నది. ఈ గొడవ ఎప్పటి వరకు పూర్తి అవుతుందో తెలియడం లేదు.  రాజధాని పార్టీలు ప్రస్తుతం అయోమయంలో పడిపోయాయి.  మూడు రాజధానుల అంశం కొందరిలో ఆసక్తి నెలకొంటే మరికొందరిలో అయోమయం తీసుకొచ్చింది.  ఈ గందరగోళానికి కారణం ఏంటో ఇప్పుడు విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

 


రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తుండటంతో రాజకీయ నాయకుల్లో గందరగోళం నెలకొన్నది.  తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపింది అనే నెపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాలి.  అయితే, బీజేపీ కూడా పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని మొదట చెప్పింది.  కానీ, తరువాత జరిగిన రాజకీయ కారణాల వలన బీజేపీ కూడా తరువాత మూడు రాజధానులకు నో చెప్పింది.  

 


కన్నా లక్ష్మీనారాయణ రాజధాని రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే. . బీజేపీ ఇలా యూ టర్న్ తీసుకోవడానికి కారణం ఉన్నది.  బీజేపీ ఎంపీకి రాజధానిలో భూములు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి.  కానీ, ఈ ఆరోపణలను పార్టీ తిప్పికోట్టింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నది బీజేపీ.  అయితే, అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం కర్నూలులో రాజధాని ఉండాలని అంటున్నారు.  

 


కర్నూలులో ఇప్పటికే అన్యాయం జరిగింది.  ఇంకా అన్యాయం జరగడం ఇష్టం లేదు కాబట్టి కర్నూలులోనే రాజధాని ఉండాలని పట్టుబడుతున్నారు.  దీంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొన్నది.  ఒక్క బీజేపీ, తెలుగుదేశం పార్టీలే కాదు, అటు వైకాపాలోను అంతర్గంతంగా దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.  కానీ బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  మూడు రాజధానుల రగడ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: