ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. నాకు కోపం వస్తే ఎవరిని కొడతానో కూడా తెలీదు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రోటోకాల్ ప్రకారం తనను ఆహ్వానించక పోవడం పై బీసీ సంక్షేమ అధికారుల పైన తీవ్రస్థాయిలో సీరియస్ ఐన స్పీకర్ వ్యాఖ్యలు ఆ కామెంట్లు మరువక ముందే తాజాగా తన సహనం కోల్పోయి శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ భావన ప్రారంభ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో అక్కడున్న అధికారులపై మండిపడ్డారు. మేటర్ ఏమిటంటే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కట్యాచార్యుల పేట లో సచివాలయ భవనాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించడం జరిగింది.

 

ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో తమ్మినేని సీతారాం స్పందిస్తూ...నాకు గాని సహనం కోల్పోతే నాకు కోపం వస్తే ఎవడిని కొడతానో కూడా తెలీదు అంటూ అధికారులపై కామెంటు చేయడంతో అక్కడ ఉన్న అందరూ అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. రైతు సమస్యలు కారణంతో ఏపీ స్పీకర్ సీతారాం ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు అని పార్టీ నేతలు ఈ సందర్భంగా తెలిపారు.

 

ఇటువంటి నేపథ్యంలో వైయస్ జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేయడం కోసం వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల హర్షం వ్యక్తం చేసిన తమ్మినేని సీతారాం అదే సమయంలో అమరావతిలో ఏమున్నది అక్కడ ఉన్నదంతా ఎడారి అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారటంతో అప్పట్లో టిడిపి జనసేన మరియు అమరావతి ప్రాంత ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో తాజాగా నాకు కోపం వస్తే ఎవడిని కొడతానో కూడా తెలీదు అంటూ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతారాం చేసిన వ్యాఖ్యలు మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు గా ఏపీ పాలిటిక్స్ లో మారాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: