దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఎవరూ ఊహించని ప్రకటన చేయటంతో ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పేటీఎం, ఫ్రీ ఛార్జ్ వంటి డిజిటల్ యాప్ లు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయి. 
 
కానీ ప్రస్తుతం దేశంలో లావాదేవీలన్నీ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ద్వారా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే లాంటి అప్లికేషన్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వం కూడా భీమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ లు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుతోంది. 
 
అదే సమయంలో ఎన్.సీ.పీ.ఎల్ అంచనాల ప్రకారం దేశంలో 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులు ఉన్నారని అంచనా. భారత్ లో యూపీఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.పీ.సీ.ఐ) ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యం అందించాలని సంకల్పించింది. సీఐఐ సీవో, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కలిసి ఎన్.పీ.సీ.ఐ ఉమ్మడిగా ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టాయి. 
 
ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ నిర్వహణ సంస్థ యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో వినియోగించటానికి వీలుగా సాఫ్ట్ వేర్ ను రూపొందించిన వారికి మొదటి బహుమతిగా 35.85 లక్షల రూపాయలు, రెండవ బహుమతిగా 21.5 లక్షల రూపాయలు, మూడవ బహుమతిగా 14.34 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలోని టెక్కీలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 12వ తేదీతో ఈ పోటీ ముగియనుంది. యూపీఐ నిర్వహణ సంస్థ మార్చి నెల 14వ తేదీన విజేతలను ప్రకటించనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: