ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామని ఎదురు చూస్తూ ఉంటాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఏ చిన్న తప్పిదం జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఇక బాబు చేసే శవ రాజకీయాలకు అంతే ఉండదు. గతంలో ఇసుక కొరత కారణంగా చంద్రబాబు దీక్ష చేపట్టిన సమయంలో సహజ మరణాలు కూడా ఆకలి మరణాలుగా చూపించి చంద్రబాబు శవ రాజకీయాలకు తెరతీసినట్టు విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయినా బాబులో ఏ  మార్పు కనిపించడం లేదు. రాజధానిగా అమరావతిని జగన్ తప్పిస్తున్నారంటూ లేనిపోని హడావుడి చేస్తూ గందరగోళం సృష్టించేందుకు బాబు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా అక్కడి ప్రజలను, రైతులను రెచ్చ గొడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా వ్యవహరిస్తున్నాడు. 


తాజాగా రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ మార్గం అంటూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో రగిలి పోతున్నారు. తాజాగా ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఓ రైతు గుండెపోటుతో మరణించడంతో ఆ మరణాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజధానిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా ఆయన గుండెపోటుకు గురై మరణించాడు అంటూ సరికొత్త ఆరోపణలకు చంద్రబాబు దిగారు. 


వాస్తవంగా కొమ్మినేని నాగమల్లేశ్వరరావు అనే రైతు రాజధానిలో తనకున్న 1.2 ఎకరాలను 1.8 కోట్లకు అమ్మారు. ఆ డబ్బుతో పిడుగురాళ్ల సమీపంలోని వీరయపాలెంలో 10 ఎకరాలు, వడ్లమన్ను లో నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే ఆయన శనివారం ఉదయం దొండపాడులో గుండెపోటుతో మరణించాడు. ఆయన ఆందోళన కార్యక్రమంలోనే పాల్గొని మరణించినట్లుగా చంద్రబాబు రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలో న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.


 ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బాబు నాగ మల్లేశ్వర మరణాన్ని కూడా అమరావతి గొడవల్లో కలిపేసి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అంటూ వైసిపి నాయకులు చంద్రబాబు పై మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: