జనవరి 5వ తేదీన చరిత్రలో ఎంతో మంది ప్రముఖులు  పుట్టారు . కొంతమంది ఈ లోకంలో లేని వారు ఉంటే కొంతమంది ఈ లోకంలో ఉన్న వారు ఉన్నారు. ఇంతకీ జనవరి 5వ తేదీన ఎవరు జన్మించారు చూద్దాం రండి.

 

 

 

షాజహాన్ జననం  : షాజహాన్ భారతీయులకు తెలియని వాడు కాదు. తాజ్మహల్ నిర్మించిన వ్యక్తి . తాను ప్రేమించిన మున్తాజ్ మరణానికి గుర్తుగా తాజ్మహల్ నిర్మించారు షాజహాన్. మొఘల్ సామ్రాజ్య ఐదవ చక్రవర్తిగా పాలన అందించారు. ఇప్పటికీ షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ ఆగ్రా లో భారతదేశ సుప్రసిద్ధ కట్టడాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. కాగా షాజహాన్ 1592 జనవరి 5వ తేదీన జన్మించారు... 1666 లో మరణించారు షాజహాన్ .ఇప్పటికి  షాజహాన్ ను  పలుమార్లు ప్రేమకు చిహ్నంగా ప్రేమికులు  గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 

 

 

 పరమహంస యోగానంద జననం : భారతదేశంలో ప్రముఖ గురువు అయిన యోగానంద పరమహంస 1883 జనవరి 5వ తేదీన జన్మించారు. ఈయన  బెంగాల్ కు  చెందిన ఒక యోగి ఆయన జన్మ నామం. పరమహంస యోగానంద రచించిన యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన ఎక్కువగా అమ్ముడు పోయి  సంచలనం సృష్టించింది. 

 

 

 కె.ఎస్.ఆర్.దాస్ జననం: యాక్షన్ మరియు క్రైమ్ సినిమాలు తీయడంలో  కేఎస్ఆర్ దాసు సుప్రసిద్ధుడు. తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్. ఈయన 1936 జనవరి 5వ తేదీన జన్మించారు. తెలుగులో మోసగాళ్లకు మోసగాడు యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి సినిమా ప్రేక్షకులకు అందించారు కె.ఎస్.ఆర్.దాస్. 

 

 

 

 మమతా బెనర్జీ జననం : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా భారత ప్రజలందరికీ  మమతాబెనర్జీ కొసమెరుపు. పశ్చిమబెంగాల్ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రికార్డు సృష్టించారు ఈమె 1955 జనవరి 5వ తేదీన జన్మించారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మమతా బెనర్జీ... రాజకీయ జీవితం ప్రారంభించి అతివేగంగా రాజకీయాల్లో ఎదిగారు. ఇప్పటికి మమతా బెనర్జీ అంటే  ప్రతిపక్ష పార్టీలన్నీ భయపడుతూ ఉంటాయి.  మమతా బెనర్జీ తనదైన స్టైల్ లో రాజకీయ పాలన సాగిస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. 

 

 

 

 దీపికా పడుకొనే : దీపికా పడుకొనే సినీ ప్రేక్షకులందరికీ బాలీవుడ్  నటిగా  కొసమెరుపు. బాలీవుడ్ నటిగా  ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన అందంతో ఎంతోమంది మతిపోగొట్టిన  నటి దీపికా పదుకొనే. అంతే కాకుండా భారత సూపర్ మోడల్గా కూడా ఈ అమ్మడికి మంచి పేరు ఉంది. 1986 జనవరి 5వ తేదీన ఈ అమ్మడు జన్మించింది. 2018 సంవత్సరంలో నటుడు రణవీర్  సింగ్ ను వివాహమాడింది దీపికా పడుకొనే. ఇక వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. తనదైన స్టైల్ నటనతో ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంటుంది. 

 

 

 శ్వేతా బసు ప్రసాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి శ్వేతా బసు ప్రసాద్. 1991 జనవరి 5వ తేదీన జార్ఖండ్ లో శ్వేతా బసు ప్రసాద్ జన్మించింది. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ఈ అమ్మడు నటించిన ఎక్కువ సినిమాల్లో  తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా కొత్త బంగారు లోకం. కొత్త బంగారులోకం సినిమాలో తన నటనతో అందరిని ఆకర్షించింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: