సిపిఐ జాతీయ నేత నారాయణ ఈ మధ్యకాలంలో ఆంధ్రా రాజకీయాలపై ఎక్కువగా టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆంగ్ల విద్య పై విమర్శలు చేసిన నారాయణ తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్మాణం పై కూడా విమర్శలు  చేస్తున్నారు. ఇక తాజాగా ఓ  ఇంటర్వ్యూ కి హాజరైన సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు రాజకీయాల్లా  ఉంటే తాము పొగడతామని కానీ ప్రస్తుతం రాజకీయాల్లో పరిస్థితి అలా లేదని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఏం విమర్శించిన లేనిపోనివి ఆపాదిస్తున్నారు అంటూ విమర్శించారు నారాయణ. 

 

 

 

 దేశ రాజకీయాల్లో మొత్తం ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం పై మోదీని విమర్శిస్తే బీజేపీ నేతలు అందరూ మమ్మల్ని  పాకిస్తాన్ ఏజెంట్లతో పోలుస్తున్నారని... తెలంగాణలో కెసిఆర్ పాలన విమర్శిస్తే తెలంగాణ ద్రోహులు అని అంటున్నారని... ఆంధ్రప్రదేశ్లో జగన్ను విమర్శిస్తే చంద్రబాబు తొత్తులు అని విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు సిపిఐ నేత నారాయణ. మాతృభాషలో విద్యాబోధన జరగాలి అన్నది తమ పాలసీ అని తెలిపిన సీపీఐ నారాయణ... ఈ విషయంపై ప్రశ్నిస్తే నీ  కూతురు కొడుకు అమెరికాలో చదవట్లేదా  అంటూ  నిలదీయడం బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది అని.. వ్యవస్థ కోసం తాము ప్రశ్నిస్తుంటే ఇలా బ్లాక్మెయిల్ చేయడం తగదు అంటూ సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. 

 

 

 జగన్ ప్రకటించిన 3 రాజధానిల  నిర్ణయంపై ఏం మాట్లాడినా కూడా సీపీఐ నేత నారాయణ కూడా చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి ఆయన జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. అంతే కాకుండా ఇప్పుడు వరకు తన రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదని చేస్తారేమో అని భయంగా ఉంది అంటూ సెటైర్లు వేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయనివ్వండి ఒకవేళ చేస్తే... చేసిన తర్వాత సమాధానం చెబుతాను అంటూ సీపీఐ నేత నారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: