కోరినంత  సేపు శృంగారం చేయలేదని మరిదిపై వదిన కత్తితో దాడిచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి లో చోటు చేసుకుంది . మరిది తీవ్ర కత్తిపోట్లకు గురయి ఆసుపత్రిలో చేరడంతో , ఇరుగు , పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు . పోలీసులు సదరు వదిన , అన్నను అదుపులోకి తీసుకుని విచారించగా , వదిన , మరిది మధ్యనున్న అక్రమ సంబంధ భాగోతం  బయటపడింది .  

 

రాయబరేలి జిల్లాలో భర్త , మరిది తో కలిసి నివసించే ఒక మహిళ, భర్తతో శృంగార సుఖం లేకపోవడం తో మరిదితో అక్రమ సంబందం పెట్టుకుంది . భర్త రోజు కూలీ పనులకు వెళ్లి వచ్చి ఆదమరచి నిద్రపోయిన తరువాత మరిదితో సెక్స్ లో ఆమె పాల్గొనేది  . వీరిద్దరూ  ఇలాగే  ప్రతి రోజూ లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తుండగా , ఇటీవల వదిన, మరిదిని పదే, పదే సెక్స్ చేయాలని కోరింది . ఒకరోజు రాత్రి మొత్తం తనతో సెక్స్ చేయాలని వదిన , మరిదిపై వత్తిడి తెచ్చింది . ఇరువురు శృంగారం లో ఉండగా , తనకు అంత శక్తి లేదని చెప్పి  మరిది మధ్యలోనే సెక్స్ ఆపివేశాడు . దాంతో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం తో వంటగదిలోకి వెళ్లిన వదిన , కత్తి తీసుకుని వచ్చి మరిదిపై దాడి చేసింది .

 

ఈ దాడిలో మరిది తీవ్ర కత్తి పోట్లకు గురికావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . అన్నకు తెలియకుండా వదిన తో అక్రమ సంబంధం నెరిపినందుకు తమ్ముడికి తగిన శాస్తే జరిగిందని స్థానికులు అతన్ని తిట్టిపోస్తున్నారు . ఇక భర్త ఉండగానే మరిది తో అక్రమ సంబంధం కొనసాగించడమే కాకుండా , అతన్ని కోరినంత సేపు సెక్స్ చేయనందుకు కత్తి తో దాడి చేసిన వదినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: