ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాని పై విమర్శలు గుప్పించటానికి  ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీ పై ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా  మరోసారి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అన్న మాట మీద నిలబడు  అన్న అని  విద్యార్థులు కోరినందుకు విద్యార్థులపై లాఠీచార్జీ చేయించారు అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 

 

 

 

 తాము అధికారంలోకి రాగానే ఏపీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానంటూ ఎన్నికల ముందు పాదయాత్ర నిర్వహించిన  జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా మాట ఇచ్చారని కానీ... ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం... ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్ర లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని నారా లోకేష్ ఆరోపించారు. 

 

 

 

 ఫీజు రియంబర్స్మెంట్ కోసం అడిగిన విద్యార్థులందరినీ చీకటి గదిలో బంధించడం ఏంటి అంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు మాజీ మంత్రి నారా లోకేష్. పేద విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదుల అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం అంటూ పాదయాత్ర లో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అంటూ కోరిన విద్యార్థుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం దారుణమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ ఇప్పటికైనా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని... విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తే ఉరుకోము అని  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: