ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. రాజధాని రాష్ట్రానికి కిరీటం లేని ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన సీఎం అయిన తొలినాళ్లలో చేసిన తప్పులే రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయంటున్నారు కొందరు విశ్లేషకులు. అధికారానికి వచ్చిన మొదట్లో చంద్రబాబు మొండి వెళ్లకుండా.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు అమలు చేసి ఉంటే.. రాష్ట్రానికి ఈ కష్టం వచ్చి ఉండేది కాదంటున్నారు విశ్లేషకులు.

 

రాష్ట్ర విభజన తరువాత కేంద్రం శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ప్రధాన కర్తవ్యం..దానికి గల వివిధ ప్రత్యామ్నయాలను అధ్యాయం చేయడం. అదే సమయంలో కొన్ని విషయాలను కమిటీ సూచించింది. ఉన్న వ్యవస్థలకు అతి తక్కువ భంగం కలిగే విధంగా కమిటీ రెకమొండేషన్‌ ఉండాలని కేంద్రం సూచించింది. ప్రాంతీయ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మీ సూచన ఉండాలని, స్థిరమైన అభివృద్ధి సాధ్యమయ్యేలా రాజధానిని సూచించాలని, ముఖ్యంగా ప్రకృతి వైఫరిత్యాలను కూడా అంచనా వేసి రాజధానికి రెకమెండేషన్‌ చేయాలని కేంద్రం ఈ కమిటీకి సూచించింది.

 

భూ సేకరణ కనిష్ట స్థాయిలో ఉండాలని ఆరు సూచనలు ఇస్తూ ఆ రోజు శివరామకృష్ణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరు నెలల పాటు రాష్ట్రం మొత్తం తిరిగింది. ఒక మంచి రెకమొండేషన్‌ ఇచ్చింది. ఇక ఇప్పుడు వచ్చిన బీసీజీ కమిటీ రిపోర్టు అర్థం చేసుకోవాలంటే పాత రిపోర్టులు కూడా అధ్యయనం చేయాలి. ఒక మహానగరం కట్టడం, దాన్నే రాజధాని చేయడం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ నిర్మాణం కాదు. ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి కాబట్టి ఈ ఆప్షన్‌ అంత మంచిది కాదని శివరామకృష్ణ చెప్పారు.

 

రెండో ఆప్షన్‌..ఉన్న పట్టణాలను విస్తృతీకరించి అక్కడే రాజధాని పెట్టుకోవడం. మూడో ఆప్షన్‌..ప్రభుత్వ కార్యాకలాపాలను వికేంద్రీకరించాలని సూచించింది. ఈ వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు కమిటీ చక్కని సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలో కొన్ని కార్యాలయాలు ఉండేలా, గుంటూరు, విజయవాడ ఏరియాల్లో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా, రాయలసీమకు సంబంధించి కాళహస్తి, నడికుడి ప్రాంతాల్లో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా చాలా చక్కనైన రెకమొండేషన్లు ఆ కమిటీ చేసింది. కానీ చంద్రబాబుకు ఇవేవి పట్టలేదు. అందువల్లే మొండిగా అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం వల్లే ఇప్పుడు ఈ దుస్థితి తలెత్తిందంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: