ఇటీవల హాజీపూర్ లో బాలికల హత్య కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న శ్రీనివాస రెడ్డి ని నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి స్పెషల్ కోర్టులో కొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ నిమిత్తం జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చాలా తెలివిగా తిక్కతిక్కగా సమాధానాలు చెబుతూ అతితెలివి ప్రదర్శించాడు. విచారణ సందర్భంగా 44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముందు చదివి వినిపించారు.

 

న్యాయమూర్తి ఎన్ని చెప్పినప్పటికీ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తనకే పాపం తెలియదని అంతా అబద్ధమని కావాలని పోలీసులు ఇరికించారని న్యాయస్థానంలో పేర్కొన్నాడు. బాలిక శ్రావణి బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సాక్షులు చెబుతున్నారని న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డికి తెలియజేయగా...నాకసలు బైక్ నడపటం రాదని నాకేమీ తెలియదు అన్న అంతా అబద్ధం అంటూ పదేపదే చెప్పాడు...అంతేకాకుండా లోదుస్తుల ఆనవాలు గురించి ప్రశ్నించిన సందర్భంలో అదంతా పోలీసులు సృష్టి అని తెలియజేయగా తన స్థలంలో దొరికిన బీరు పాటలపై మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి దాని సంగతి ఏంటని జడ్జి ప్రశ్నించగా పలని పోలీసులు బలవంతంగా ఫింగర్ప్రింట్ నా దగ్గర తీసుకున్నారని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

 

అసలు ఈ కేసులో పోలీసులు కావాలని తనని అనేక హింసలు పెట్టి కొట్టి నేరం ఒప్పుకొను ఎలా చేశారని శ్రీనివాసరెడ్డి న్యాయమూర్తి ముందు తన వాదన వినిపించాడు. ఇటువంటి సమయంలో న్యాయమూర్తి మృతురాలి దుస్తులపై ఉన్న వీర్యకణాలు గురించి ప్రశ్నించినప్పుడు..నా దగ్గర పోలీసులు కావాలని వీర్యకణాలు తీసుకున్నారని నాకు అసలు మగతనం లేదని శ్రీనివాస రెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. గతంలో ఇంకా శ్రీనివాసరెడ్డి అనేక అత్యాచారాల ఘటనలు గురించి ప్రస్తావించిన సందర్భంలో వాటి గురించి కూడా నాకు ఏమీ తెలియదని న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటంతో న్యాయమూర్తి కేసు ని వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్లు మిగతా బాధిత కుటుంబాలు శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: