చంద్రబాబు అమాయక మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. " రాజధాని సెంటిమెంట్‌తో మహిళలను రోడ్డు మీదకు తీసుకువచ్చి ఏదో అన్యాయం, నష్టం జరుగుతుందని చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇలా ఉద్యమాన్ని ప్రేరేపించాలనుకోవడం సరైన విధానం కాదు. లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం చంద్రబాబు ఏ స్థాయికి అయినా దిగజారుతాడు. చంద్రబాబు నైజం అందరికీ తెలుసూ.. చరిత్ర కూడా చెబుతుంది. అధికార పీటం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ మరణానికి పరోక్షంగా కారణమైయ్యాడన్నారు మోపిదేవి.

 

ఇలాంటి పరిస్థితుల్లో తన రాజకీయ పబ్బం కోసం అమాయక మహిళలను ఆసరా చేసుకొని ఉద్యమాలు చేయిస్తూ.. కారుణ్య మరణాలకు ప్రోత్సహించేలా చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు. అమరావతి రైతులను అన్ని విధాలుగా సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకుంటారు. ఇంకా మెరుగైన పద్ధతిల్లో ఈ ప్రాంత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏఏ కార్యక్రమాలతో అమరావతి అభివృద్ధి చెందుతుందో ప్రభుత్వపరంగా దృష్టిసారిస్తాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు. అందరినీ అన్ని విధాలుగా అందుకుంటాం’ అని మంత్రి మోపిదేవి హామీ ఇచ్చారు.

 

రాష్ట్ర విభజన తరువాత వేసిన కమిటీలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ, జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు అన్ని కమిటీలు ఇచ్చిన నివేదికల్లో సారాంశం.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని స్పష్టంగా ఉన్నాయని మోపిదేవి అన్నారు.

 

కానీ, చంద్రబాబు అమరావతిలో రాజధాని అనే సెంటిమెంట్‌తో అమాయక మహిళలను రోడ్డు మీదకు తీసుకువచ్చి కారణ్య హత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నాడన్నారు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం చంద్రబాబు ఎంత స్థాయికైనా దిగజారుతాడనే విషయం అందరికీ తెలుసన్నారు. రాజధాని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం చేసేలా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారని మోపిదేవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: