జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తలనొప్పి పై తలనొప్పులు సొంత పార్టీ నేతలే తెచ్చి పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పార్టీ స్థాపించిన తర్వాత పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. ఏకంగా పార్టీని స్థాపించిన నాయకుడే ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఓటమి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మన ఏపీ రాజకీయాలను చాలా మంది షాక్ తిన్నారు.

 

అయితే అధికారంలోకి జగన్ రావడంతో జగన్ ని టార్గెట్ గా చేసుకుని ఎప్పటి లాగానే పవన్ కళ్యాణ్ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏదో రకంగా జగన్ సర్కార్ ని ఇబ్బందులపాలు చేయాలని పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం విషయంలో మరియు అదే విధంగా ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వంపై ప్రజలలో తిరుగుబాటు తీసుకు రావడానికి అనేక రకాలుగా ప్రయత్నించినా గాని ఏపీ ప్రజలు మాత్రం పెద్దగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలు పట్టించుకోలేదు. ఇదే తరుణంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జగన్ అందిస్తున్న సంక్షేమ పరిపాలనకు జై కొట్టడం జరిగింది.

 

ఒకపక్క అదే పార్టీకి చెందిన అధ్యక్షుడు పవన్...సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు మంచిది కాదని తనవారి లాభాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ని డేంజర్ జోన్లో పడేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మాట్లాడుతుంటే మరోపక్క పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా జగన్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని మూడు రాజధానుల విషయంలో జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని అమరావతి లో పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్న సమయంలో రాపాక వరప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేయడంతో జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఇప్పటికైనా రాపాక వరప్రసాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: