సంపాదించిన సొమ్ములో కనీసం 20 శాతం అయినా సరే భవిష్యత్ అవసరాల కోసం దాయకపోతే.. ముందు ముందు బతుకు బండి భారం అవుతుంది. అనుకోని కష్టం వచ్చినప్పుడు అందరి ముందు చేయిచాపాల్సి వస్తుంది. అందుకే ఎంత ఆదాయం వున్నా ప పొదుపు తప్పనిసరి. మరి ఇలా పొదుపు చేసే సొమ్ముతో ఏం చేయాలి..? ఎక్కడ ఈ సొమ్మును మదుపు చేస్తే ఎక్కువ లాభం. ఈ ప్రశ్నలు అందరికీ సహజమే.

 

సాధారణంగా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా తగ్గించేశాయి. అందువల్ల అది అంత లాభదాయకం కాదు. ఇలాంటి సమయంలో పోస్టాఫీసు మంచి పథకాలు అందిస్తోంది. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ ఇస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో 4 నుంచి 8.6 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది.

 

నష్టభయం వద్దనుకునేవారికి, దీర్ఘకాలం మదుపు చేసేవారికి ఈ పోస్టాఫీసు పథకాలు వరాల్లాంటివనే చెప్పాలి. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల గురించి తెలుసుకుందాం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో డబ్బులు మదుపు చేస్తే ప్రస్తుతం 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ మొత్తం ఏడాదికొకసారి ఖాతాకు జమవుతుంది. మీరు రూ. 100తో కూడా పొదుపు ప్రారంభించొచ్చు. ఐదేళ్లపాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్‌కు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

 

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ లో పొదుపు చేస్తే వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకొకసారి అకౌంట్‌కు జమవుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి 6.9 శాతం వరకు చెల్లిస్తారు. దీన్ని సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారు. కనీసం రూ.200 డిపాజిట్ చేయాలి. గరిష్ట పరిమితి ఉండదు. ఈ అకౌంట్‌ను ఐదేళ్ల వరకు కొనసాగించ వచ్చు. పన్ను ప్రయోజనాలుంటాయి.

 

మరో పథకం.. కిసాన్ వికాస్ పత్ర.. ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ పొందొచ్చు. ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తం అకౌంట్‌కు జమవుతుంది. కనీసం రూ.1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఉండదు. ఇక్కడ మదుపు చేస్తే డబ్బు 9 ఏళ్ల 5 నెలల కాలంలో రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: