లోకంలో నేరస్దులు చాలా తెలివి మీరిపోయారనిపిస్తుంది కొందరు నేరగాళ్లను చూస్తే. ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్లు పంగనామాలు పెట్టి విదేశాలకు చెక్కేసిన నేరగాళ్లు మనకు తెలిసిందే. ఇక ఈ మద్యకాలంలో ఏం చక్కా రేపులు, మర్డర్లు చేసి సినిమాల్లో విలన్ వేషదారులు, రాజకీయనాయకులు నటిస్తారు చూడు కేసు అనగానే గుండెనొప్పని, లేదా మరేదో నొప్పని ఇలాంటి వేషాలు నిజ జీవితంలో కూడా నేరగాళ్లు శిక్షల నుండి తప్పించుకోవడానికి వేస్తుంటారు అని నిరూపించాడు శ్రీనివాస్ రెడ్డి అనే కామాంధుడు..

 

 

ఇక సైకో శ్రీనివాస్ అని పిలవబడే అలియాస్ హాజీపూర్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్కూల్ కు వెళ్లే అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి బైక్ పై ఎక్కుంచుకొని తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ తరువాత అతి కిరాతకంగా హత్యలు చేసిన అతనిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారన్న విషయం తెలిసిందే. ఇక ఇతని కేసు విషయంలో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతుండటంతో, తెలంగాణ సర్కార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసింది.

 

 

అయితే ఇప్పటి వరకు పోలీసుల విచారణలో తాను నేరం చేసినట్లుగా ఒప్పుకున్న శ్రీనివాస్ ఇప్పుడు కోర్టులో మాత్రం జడ్జ్ ఎంత ప్రశ్నించిన తనకి ఆ హత్యలతో ఎలాంటి సంబంధం లేదని, తాను ఎవరిని అత్యాచారం చేయలేదని పోలీసులు తనని బలవంతంగా ఇరికించారని పదే పదే చెబుతూ న్యాయమూర్తిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాకుండా తనకు మగతనం లేదని, అలాంటిది తాను ఎలా అత్యాచారం చేస్తానని వాదించాడు. పోలీసులే తన నుంచి సిరంజీతో వీర్యం సేకరించి ఆ హత్యలు అన్ని తానే చేసినట్లు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు.

 

 

అంతేగాక అసలు తనకి బైక్ నడపడమే రాదని, ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు బలవంతంగా తన నుంచి తీసుకున్నారని వాదించాడు. ఇంకా నయం వేలు నోట్లోపెడితే కొరకడం కూడ రాదని చెప్పితే బాగుండును అని అనుకుంటున్నారట ఈ విషయం విన్న వారు.. ఇక ఇప్పటికే ఈ ఈ హత్య కేసులలో నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనలు మిగిలిన  44 మంది సాక్షులని విచారించి వారి వాంగ్మూలం చదివి వినిపించిన న్యాయమూర్తి మరికాస్త సమయాన్ని పొడిగించి ఎలాంటి తీర్పు చెప్పకుండా మరోసారి కేసుని ఈ నెల 6వ తేదీకి  వాయిదా వేసారు.

 

 

అయితే ఇతడే నిందితుడనే ఆధారాలు అన్ని రుజువు కావడంతో ఉరిశిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. కాగా ఆ శిక్షనుండి తప్పించుకోవడానికే నిందితుడు ఇలాంటి వేషాలు వేస్తున్నాడని మృతుల కుటుంబీకులు అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ మృగానికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: