ఒక రూపాయి దానం చేయాలన్నా కూడా చాలామంది దానం చేయటానికి ఎంతో ఆలోచిస్తారు. కానీ బెంగళూరులోని ఒక మహిళ మాత్రం దాన గుణానికి హద్దులు లేవని 300 కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఎంత ఆస్తి సంపాదించామని కాదు ఎంతమంది పేమ, ఆప్యాయతలను సంపాదించాం అనేదే ముఖ్యమని 300 కోట్ల రూపాయల ఆస్తి దానం చేసిన మహిళకు ఇప్పుడు అందరూ చేతులెత్తి మొక్కుతున్నారు. 
 
ఇంత గొప్ప మనస్సు ఉన్న ఆ మహిళ పేరు మీరా నాయుడు. క్యాన్సర్ వ్యాధితో బాధ పడే మహిళల సంక్షేమం కొరకు మీరానాయుడు 32 గదులు ఉన్న, 300 కోట్ల రూపాయల ఆస్తిని కేటాయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే బెంగళూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో మెజిస్ట్రిక్ ఒకటి. మెజిస్ట్రిక్ ప్రాంతంలో లక్ష్మీ హోటల్ పేరుతో 300 కోట్ల రూపాయల విలువ చేసే భవనం ఉంది. 
 
300 కోట్ల రూపాయల విలువ చేసే ఈ లక్ష్మీ హోటల్ త్వరలో లక్ష్మీ బాలల ఆరోగ్య కేంద్రంగా మారిపోనుంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయటానికి ఎంతోమంది వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల నుండి బెంగళూరు నగరానికి వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించాలని మీరా నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగా పేదలకు క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తున్న శంకర్ ఆసుపత్రికి ఆ భవనాన్ని అప్పగించారు. 
 
మీరానాయుడు మాట్లాడుతూ " నా భర్త శ్రీనివాసులు నాయుడు ఈ భవనాన్ని కట్టించాడు. పేదవారి కోసం ఈ భవనం దానం చేయడం వలన ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. భవనం ఉన్న ప్రదేశంలో మరో బిల్డింగ్ కడితే డబ్బులు వచ్చి సంపద పెరుగుతుందేమో కానీ ఆత్మ సంతృప్తి మాత్రం ఉండదు" అని అన్నారు. శంకర్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే బాలలు, వారి తల్లిదండ్రులు ఉచితంగా ఈ భవనంలో ఉండి చికిత్స తరువాత ఇంటికి తిరిగి వెళ్లిపోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: