నిన్న టీవీ చూస్తుంటే ఓ ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ వ్యక్తి తెగ బాధపడిపోతున్నాడు. ఆయన బాధ చూస్తే నాకే కాదు టీవీలు చూసే వారందరికీ తెగ బాధ వచ్చేసింది. రాష్ట్రం ఏమైపోతుందో ... ఎక్కడికి వెళ్లిపోతుందో తెలియక ఆ పెద్దాయన బాదపడిపోతూ ఓ కుర్ర ముఖ్యమంత్రి మీద తన 'నారా నారాల్లోనూ' పెంచుకుని అణుచుకుని ఉన్న కోపాన్నంతా మీడియా గొట్టాల ముందు కక్కేస్తుంటే మాకు బాధా రాకుండా ఉండదా చెప్పండి !
అసలు ఆ కుర్ర ముఖ్యమంత్రికి పనేమీ లేదా హాయిగా కుర్చీలో కూర్చుని నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా జనాల కోసం తాపత్రయం ఎందుకు అతగాడికి. మా చండ్ర మామని సూడండి ఇక్కడ హొటేలు పెడితే పతివోడు ఫ్రీ గా హోటేల్లో దూరెత్తడని అక్కడెక్కడో ఉన్న సింగపూరీ లో హొటేలు ఎట్టాడు. అయినా ఈ కుర్ర ముఖ్యమంత్రికి తెలివే లేదండి.


 అయ్య బాబోయ్ మా చండ్ర మామ మీడియా ముందు చేస్తున్న బోర్ కొట్టే యాక్టింగ్ గురించి సెప్పడం మానేసి ఎక్కడెక్కడికో ఎల్లిపోతున్నానేంటి ? గంటలు గంటలు మీడియా సమావేశాలు పెట్టి సెప్పింది సెప్తూ బోర్ కొట్టించే అంత టాలెంట్ అసలు ఈ భూప్రపంచం మీద ఎవరికైనా ఉందా ? ఇప్పుడు వరకు ఆ కుర్ర సీఎం పెట్టిన పథకాలు, అన్నీ ఎప్పుడో అమలు చేద్దామని మా చండ్ర మామ అనుకున్నాడు. అన్నీ నేనే సేసేత్తే నా ముద్దుల కొడుకు ముద్ద పప్పు సీఎం అయ్యాక ఏమి చేస్తాడు అని అవన్నీ ఆయన బుర్రలో దాచుకుంటే మీరు ఆయన్ని ఆడిపోసుకుంటారా ? మాకు బాధగా ఉండదా అండి. 


అందుకే ఆ కుర్ర సీఎం చేస్తున్న అభివృద్ధి అనే అరాచకాన్ని నా నా రకాలుగా ఖండించేందుకు మా చండ్ర మామ నిన్న మీడియాను పిలిసి మళ్ళీ మళ్ళీ అదే సొల్లు చెబుతుంటే వినే వాళ్ళు చండ్ర బాబు బోర్ కొట్టించెత్తన్నాడు అంటారా ? దిస్ ఈజ్ వెరీ దారుణం కదా. అసలు ఎంత ధైర్యం ఆ కుర్ర సీఎం కి మా చండ్ర మామ రాజధానిగా అమరావతిని పెడితే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటాడా ? అందుకే కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన సోల్లె మళ్ళీ చెప్పాడు. ఆ బోస్టన్ కమిటీ అధ్యయనం చేసిన కాగితాలన్నీ భోగిమంటల్లో వేయమన్నాడు. పాపం ఆ రైతు ఎవరో గుండెపోటు తో చనిపోతే దానికి ఆ కుర్ర సీఎం కారణం అని చెప్పింది. అసలు మా చండ్ర మామ తీసుకున్న నిర్ణయాలు మార్చడానికి వీళ్ళు ఎవరు ? 


అసలు విశాఖను అభివృద్ధి చేసింది నేనే అని మా చండ్ర మామ ప్రెస్ మీట్ లో చెబితే అవునా అని నోరెళ్ళబెట్టాను. నిజమే కదా హైదరాబాద్ , అమెరికా ఇలా అన్నిటిని ఈయనే కదా డెవెలప్ చేసింది. అసలు ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా అది నేనే ఇది నేనే అని బడాయి చెప్పుకోకూడదా ? ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పిందే చెబుతున్నాడు అని ఊరికే ఆడిపోసుకుంటారా ? చెబితే తప్పేంటి ? మా చండ్ర మామ చెప్పినట్టు రాసుకెళ్లే మీడియా ఉండగా. అన్నట్టు మా చండ్ర మామ పెట్టే ప్రెస్ మీట్లకు ఆ సాచ్చీ టీవీ కానీ రావట్లేదు కదా ! 

మరింత సమాచారం తెలుసుకోండి: