గత కొన్ని రోజులుగా కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఆయన రాజకీయ వారసుడైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారు అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ వర్గాల్లో కూడా ఈ ప్రచారం ఊపందుకుంది. టిఆర్ఎస్ నేతలు మొత్తం కెసిఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే వీటిపై తాజాగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో  మీడియాతో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని కేసిఆర్ కు  అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

 

 

 టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను  ముఖ్యమంత్రిగా చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దించి వేయాలని టిఆర్ఎస్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలు మాట్లాడుకుంటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో టిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. టిఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చింది అని వ్యాఖ్యానించిన రేవంత్... కేసిఆర్ ఇంట్లో రాత్రికి రాత్రి ఏమైనా జరగవచ్చు అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అల్లుడు  నుంచి కేసీఆర్ కు ముప్పు తప్పిందని అతని కుమారుడు కేటీఆర్ నుంచి మాత్రం కేసిఆర్ కు ముప్పు పెరిగింది అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ఇంట్లోనే కేటీఆర్ ఉంటున్నారని కేటీఆర్ ను కేసిఆర్ తన ఇంటి నుంచి పంపి వేయాలి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

 

 ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చిచ్చు పెడుతోంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్  ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు అని వెంటనే... కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే ఏమైనా జరిగే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ను వెంటనే ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ కు మరింత భద్రత పెంచాలని కేటీఆర్ నుంచి ముప్పు పొంచి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు సంచలనంగా  మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: