ట్రంప్ లో యుద్ధ కాంక్ష బలీయంగా ఉన్నది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి.  అందులో ఒకటి ఉత్తర కొరియాతో లొల్లి, ఇరాన్ తో గొడవ.  ఈ రెండు ఆ దేశాన్ని భయపెడుతున్నాయి.  ఉత్తర కొరియా అమెరికా అంటే ఒంటికాలిపై లేస్తుంది.  తమ జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది.  ఉత్తర కొరియా అధినేత కిమ్ ఈ విషయంలో వెనక్కి తగ్గడు అనే విషయం ట్రంప్ కు బాగా తెలుసు.  అందుకే కిమ్ జోలికి వెళ్లేందుకు కొద్దిగా వెనకాడుతున్నారు.  


ఇప్పుడు ఇరాన్ పై కూడా అమెరికా ఒంటికాలిపై లేస్తుంది.  ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసుకుంటుంది అనే సంగతి తెలిసిన తరువాత ఆ దేశంపై ఆంక్షలు విధించింది.  ఇరాన్ లో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయి.  ఈ చమురు నిల్వల కారణంగా ఆ దేశం సమృద్ధిగా ఆదాయం తెచ్చుకుంటోంది.  ఆసియా దేశాలకు, అటు ఆఫ్రికా దేశాలకు, యూరోపియన్ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నది.  ఈ స్థాయిలో చమురు నిల్వలు ఉండటంతో ఆ దేశంపై ఆంక్షలు విధించినా పెద్దగా భయపడటం లేదు.  


ఇటీవలే ట్రంప్ సైన్యం ఇరాన్ మిలటరీ ఆఫీసర్ సులేమానిపై దాడి చేసి హతమార్చాయి.  దీంతో ఇరాన్ కోపంతో రగిలిపోతుంది.  అమెరికాపై దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నది.  అయితే, ఇరాన్ ఆర్మీ ఆఫీసర్ పై దాడి చేసి చంపెయ్యడానికి చెప్తున్న కారణాలు వింతగా ఉన్నాయి.  ఢిల్లీ, లండన్ లపై దాడులు చేయడానికి సులేమాని పధకాలు వేస్తున్నారని అక్కడ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పక్కా సమాచారం ఉండటంతో దాడి చేశామని అంటున్నారు.  


దీనిని ఎంతవరకు చూడాలో తెలియడం లేదు.  ఇలా దాడులు చేయడం వెనుక ఈ రకమైన కారణాలు ట్రంప్ ఎందుకు చెప్తున్నారో తెలియడం లేదు.  ఢిల్లీలో అలజడులు చేస్తారేమో అని దాడి చేయాలంటే పాక్ పై దాడి చేయాలి.  అక్కడనున్న ఉగ్రవాదులను ఏరివేయాలి.  అంతేకాని ఇరాన్ పై దాడి చేస్తూ.. దానిని ఢిల్లీని, లండన్ లను ఎందుకు చూపుతున్నారో అర్ధంకాని విషయం. దాడులు చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: