జాతిపిత మహాత్మాగాంధీ భారతదేశంలో పేదరికం పూర్తిగా నిర్మూలన అవ్వాలి అంటే దేశంలోని ధనవంతులు అంతా తమకు ఉన్న సంపద తమది కాదనీ దేవుడు తమకు ఇచ్చింది అని భావించి ఆ సంపాదకు తమకు తామే ట్రష్టీలుగా మారి తమ సంపదలో ఎంతో కొంత పేదలకు ఖర్చు చేసినప్పుడు మాత్రమే దేశంలోని పేదరికం తొలిగిపోతుంది కానీ  ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టినా పేదరికం తొలగిపోదు అంటూ స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలలకే చెప్పారు.

ఇప్పుడు ఆయన మాటలను నిజం చేస్తూ బెంగుళూరు హైటెక్ సిటీలో బంగారంతో సమానమైన 300 కోట్ల విలువ చేసే ఒక హోటల్ ఉంది. దానికి సంబంధించిన ఒక స్థలాన్ని క్యాన్సర్ వ్యాధితో బాధపడే బాలల సంక్షేమం కోసం పాటు పడుతున్న ఒక ట్రస్టుకు విరాళంగా ఇచ్చిన మీరా లక్ష్మి దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా వార్తలలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే బెంగుళూరులోని గాంధీనగర్ లో ‘లక్ష్మీ హోటల్’ అనే హోటల్ సుమారు 70 సంవత్సరాల నుండి నడపబడుతోంది. బెంగుళూరులోని లక్ష్మీ హోటల్ ప్రాముఖ్యత తెలియాలి అంటే ఒకనాటి తమిళ సూపర్ స్టార్ రాజ్  కుమార్ కన్నడ హీరో విష్ణువర్ధన్ లాంటి ఎందరో ప్రముఖ సినిమా సెలెబ్రెటీలు వ్యాపార వేత్తలు ఆ హోటల్ కు తురుచు వస్తూ ఉండే వారట. 

ఆ హోటల్ యజమాని మీరా నాయుడు ఆ హోటల్ వ్యాపారంతో బెంగుళూరులో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ హోటల్ ఈమధ్య కాలం వరకు నడపబడింది. ఆ హోటల్ యజమాని శ్రీనివాసనాయుడు ఈమధ్య మరణించడంతో ఆ హోటల్ ను కొనడానికి అనేకమంది ముందుకు రావడమే కాకుండా 300 నుండి 400 కోట్ల ధరకు కొనడానికి సిద్ధపడినా శ్రీనివాస నాయుడు భార్య మీరా నాయుడు అంగీకరించలేదు. ఆ హోటల్ ను తన భర్త గౌరవార్ధం పేద పిల్లలు క్యాన్సర్ చికిత్స కోసం ఎంతో సేవ చేస్తున్న శంకర్ హాస్పటల్ కి ఆమె దానంగా గా ఇచ్చి ఇక నుండి ఆ హోటల్ ను శ్రీనివాస నాయుడు క్యాన్సర్ హాస్పటల్ గా శంకర్ హాస్పటల్ నిర్వాహణలో సేవలు అందించడానికి మీరా సహకరించింది. దాన గుణం ఉన్న వ్యక్తి దగ్గరే సంపద వచ్చి చేరుతుందనీ అటువంటి గుణాలు ఉన్నవారినే భగవంతుడు తన నిజమైన భక్తులుగా గుర్తిస్తాడు అని బాబా చెప్పిన మాటలకు మీరా నాయుడు సజీవదర్పణం. అందుకే దాన గుణం ఉన్న వారి దగ్గరే సంపద మరింత వచ్చి చేరుతుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: