తెలంగాణలో తమ పార్టీకి ఎదురు లేదు అన్నట్టుగా ముందుకు దూసుకెళ్తున్నాడు టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో పాటు బీజేపీ అనుకున్నంత స్థాయిలో బలపడకపోవడంతో టీఆర్ఎస్ కు ప్రస్తుతం అంతా బాగానే సాగుతోంది. ఈ ధీమాతోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి తమ సత్తా చాటాలని చూస్తోంది. నిన్న పార్టీ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటికే నాలుగు సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ ప్రకటించి కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. 


ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించి కెసిఆర్ కు అదే సమయంలో తన కుమార్తె కూడా రాజ్యసభకు పంపించాలి అని కెసిఆర్ చూస్తున్నారు. ఈ పరిణామాలు ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన విషయం బయట పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇటీవల కొన్ని రకాల వార్తలు చూస్తుంటే నిజంగానే కెసిఆర్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తనకు అనుమానం కలుగుతోందని అన్నారు. ఆయన వెంటనే పూర్తిస్థాయిలో కేసీఆర్ కు రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదవి అనేది కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుందని, కేటీఆర్ ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్త పెట్టి ఒత్తిండంటే జరగరానిది ఏదైనా జరగవచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


వెంటనే కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శలు ఏ రకంగా అయినా చేయవచ్చు కానీ మరీ ఇంత ఘాటు పదజాలంతో మాట్లాడతారా అంటూ రేవంత్ పై టిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రేవంత్ ఇంత అకస్మాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏంటా అనేది అందరిని ఆలోచనలో పడేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: