ఈ మధ్య ప్రేమ పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వల వేయడం యువతుల  ఆ తర్వాత మాయమాటలు చెప్పి లొంగదీసుకోవటం ఆ  తర్వాత  వదిలించుకోవడం ఈ రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్ లో  సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఓ యువతిని అదే ఆఫీసులో పనిచేస్తున్న మరో ఉద్యోగి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు . ఆ యువతీ  కులాలు వేరు సెట్ కాదు అని వాదించిన నేను ఒప్పిస్తాను అంటూ నమ్మించి ఏడాది పాటు సహజీవనం చేసారు. ఆ తర్వాత యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో... కళ్యాణ మండపం బుక్ చేశారని పెళ్ళికూతురు రెడీ అయ్యి రావాలి అంటూ చెప్పాడు. కళ్యాణ మండపం నుంచి వెళ్లిన యువతి అక్కడ ఎవరూ లేకపోవడం చూసి అవాక్కయ్యింది . మోసపోయానని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లో నివాసముండే బాధిత యువతి మల్టీనేషనల్ కంపెనీలో నాలుగేళ్లుగా పనిచేస్తుంది. మాసబ్ ట్యాంక్ లో ఉండే ప్రవీణ్ అనే వ్యక్తి అదే కంపెనీలో పనిచేస్తూ పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ చెప్పి.. కులాలు  వేరైనప్పటికీ నేను ఒప్పిస్తాను అని  నమ్మబలికాడు ప్రవీణ్. అతని నమ్మిన యువతి అతనితో సహజీవనం చేసింది . కంపెనీ వేడుకలు ఇతర శుభకార్యాలకు కూడా ఇద్దరూ కలిసి వెళ్ళేవారు . డబ్బులు అవసరమైనప్పుడల్లా యువతీ నుంచి అడిగి తీసుకునే వాడు ప్రవీణ్. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ బాధిత యువతి ప్రవీణ్ పై ఒత్తిడి తీసుకు వచ్చింది. కానీ అతని  తల్లిదండ్రులు మాత్రం వివాహానికి అంగీకరించలేదని. నవంబర్ లో  ప్రవీణ్ ఇంటికి వెళ్ళిన బాధితురాలు తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయపడింది. 

 

 

 ఇక అదే రోజున ఫోన్ చేసిన ప్రవీణ్  తన కుటుంబం సభ్యులు అందరూ పెళ్లికి అంగీకరించారని.. హైదరాబాద్లోని పారడైస్ ఫంక్షన్ హాల్లో  పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారని అక్కడికి వచ్చి రావాలంటూ యువతికి చెప్పాడు. అయితే పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించిన యువతి పెళ్లికూతురుగా  ముస్తాబై తమ కుటుంబీకుల బంధుమిత్రులతో పెళ్లి సమయానికి ఫంక్షన్ హాల్ కు చేరుకుంది. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఫంక్షన్ హాల్ లో పెళ్లి లేదు ఏమీ లేదు. ఫంక్షన్ హాల్ కి తాళం వేసి ఉంది. దీంతో బందు మిత్రులు  కుటుంబ సభ్యులు అందరూ ముందు అభాసుపాలు అయిపోయింది ఆ యువతి. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: