పెళ్లిచూపులు చూశారు... పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఒకరి నొకరు నచ్చుకున్నారు... ఇరు కుటుంబాల మధ్య అన్ని  లాంఛనాలు కూడా పూర్తయ్యాయి... ఇక పెళ్లి కోసం  అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇప్పటికే పలు ఏర్పాట్ల  కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసారు. పెళ్లి  షాపింగ్ చేస్తూ ఇరు కుటుంబాలు హడావిడిగా ఉన్నారు. ఇంతలో వివాహం రద్దు అయిపోయింది. ఎందుకో తెలుసా... వరుడు ముక్కు బాగాలేదని వధువు పెళ్లి రద్దు చేసుకుంది. దీంతో వరుడు వైపు కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోర మంగళ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్యోతి ప్రకాష్ కు  ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయం అయింది. 

 

 

 ఇద్దరూ ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకున్నారు.. ఇక ఆ తర్వాత ఇద్దరు తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించారు . గతేడాది సెప్టెంబర్లోనే వీరిద్దరికి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఈ నెల 30న వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు ఇరు కుటుంబాల సభ్యులు. అయితే ఇరు కుటుంబాలు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి షాపింగ్  కూడా పూర్తి అయిపోయింది. అంతలో సదరు యువతి ఇరు కుటుంబాల కు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్ళికొడుకు ముక్కు పొడువుగా ఉందని... తనకు అతడి ముక్కు నచ్చలేదని పెళ్లి కూతురు చెప్పింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తన ముక్కును సరి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే పెళ్లికి ఒప్పుకోను అంటూ తేల్చి చెప్పేసింది

 

 

 దీంతో అటు  పెళ్ళికొడుకు ఇటు  పెళ్ళికూతురు కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. తామిద్దరే  పెళ్లి చేసుకుందామని అనుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి కూతురు ఇలా పెళ్ళికొడుకు ముక్కు బాలేదని సర్జరీ చేయించుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోను అని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. పెళ్లి కూతురు తీరుతో ఆగ్రహించిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు.. పెళ్లి కూతురు పై కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పెళ్లి  ఆగిపోవడం చూశాము  కానీ ఇలా పెళ్లి కొడుకు ముక్కు బాగాలేదని క్యాన్సిల్ అయిన పెళ్లి ఇదొక్కటే ఉండొచ్చు కాబోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: