గత కొన్ని వారాలుగా ఆస్ట్రేలియాలో పొదలు మండిపోతున్నాయి. అధికారులకు పరిస్థితిని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ మంటల నుండి పొగలు న్యూజిలాండ్ చేరుకున్నాయి. ఆకాశం అకస్మాత్తుగా నారింజ రంగులోకి మారినప్పుడు న్యూజిలాండ్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అకస్మాత్తుగా మారిన ఆకాశం యొక్క అసహజ రంగు గురించి అడగడానికి ప్రజలు 111 అత్యవసర కాల్ లైన్ కు ఫోన్ చేసారు. అయితే, ప్రస్తుతం ఈ ఆరెంజ్ స్కైస్ యొక్క చిత్రాలు, వీడియోలు కూడా ఈ ఉదయం ట్విట్టర్లో షేర్ చేయబడుతున్నాయి.


బుష్ ఫైర్(పొదల మంటలు) నుండి వచ్చే పొగ న్యూజిలాండ్ యొక్క సౌత్ ఐలాండ్ నుండి ఇప్పుడు నార్త్ ఐలాండ్ యొక్క పైభాగంలో ఎక్కువ భాగాన్ని కప్పేసింది. కొన్ని నివేదికల ప్రకారం, బలమైన వాయువ్య గాలులు ఆస్ట్రేలియా నుండి పొగను తెచ్చాయి. ప్రజలని భయపడవద్దని ఆరెంజ్ పొగమంచు గురించి సహాయక దళాలకు ఫోన్ చేయవద్దని పోలీసులు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. శాస్త్రవేత్తలు పొగ కారణంగా ఎర్రటి రంగు ఏర్పడుతుందని, ఇది ఆకాశం యొక్క నీలం రంగు యొక్క దృశ్యమానతను తగ్గిస్తుందని చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆరెంజ్ స్కైస్ దేశాన్ని చుట్టుముట్టిన చిత్రాలను చాలా మంది ట్విట్టర్‌ వేదికగా షేర్ చేసారు.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది, మానవులు ఉపిరి పీల్చుకునే గాలిని ఈ పొగ ప్రభావితం చేయకపోవచ్చు కాని గర్భిణీ స్త్రీలు, పిల్లలు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం ఉందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, "కాలుష్య స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది ఇప్పటికీ చెడు ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది."అని చెప్పింది.


న్యూ సౌత్ వేల్స్ వైపు మంటలు వ్యాపించడంతో ఆస్ట్రేలియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికే లక్షలాది జంతువులు ప్రాణాలు, ఆవాసాలను కోల్పోయాయి. మంటల కారణంగా సిడ్నీలో విద్యుత్ సరఫరా కూడా ముప్పు పొంచి ఉంది. నివేదికల ప్రకారం, సెప్టెంబర్ నుండి, ఈ బుష్ ఫైర్ మంటలలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోయాయి. సుమారు 3.6 మిలియన్ హెక్టార్ల (36,000 చదరపు కిలోమీటర్లు) భూమి ధ్వంసమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: