తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడిందని ఎపిసిసి ఉపాధ్యక్షురాలు సుంకర‌ పద్మశ్రీ ఆరోపించారు. అమరావతి రాజధాని లో నిన్న మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా‌ మందడంలో  రైతుల సంఘీభావంగా పద్మశ్రీ ధర్నాలో కూర్చున్నారు. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణానికే సినిమా పెద్దలు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. అందుకే రాజధాని తరలింపు విషయంలో సినీలోకం చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు.  

నోరు మెదపరే..

రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు,‌ మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపదకపోవడాన్ని ఆక్షేపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ తరలివచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ చిత్ర పరిశ్రమపై ఒత్తిడి తేవాలని ఆమె పిలుపునిచ్చారు. అప్పుడే వాళ్ళు ఇళ్ళల్లోంచి బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు. రైతులన్నా, మహిళలన్నా  చిత్ర పరిశ్రమకు గౌరవం లేదని ఆరోపించారు. మనం సినిమాలు చూస్తుంటే వారికి డబ్బులొస్తున్నాయి కాబట్టి సంతోషంగా ఉంటున్నారు.

నెల రోజులు బాయ్ కాట్..

తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ అంతా తరలి వచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.  అదే స్పూర్తితో రాజధాని అమరావతి అంశంలో కూడా స్పందించాలన్నారు. రాజధాని ఆందోళన  తెలుగు సినీ పరిశ్రమకు పట్టదా అని సూటిగా ప్రశ్నించారు. మన కోసం తరలిరాని చిత్ర‌ పరిశ్రమను నెల రోజులు బాయ్ కాట్ చేయాలని పద్మశ్రీ  పిలుపు నిచ్చారు. 13 జిల్లాల ప్రజలంతా ‌సినిమాలు చూడడం మానేస్తేకాని చిత్రపరిశ్రమకు చలనం రాదు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు,‌ ఎంపిలు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొనాలి. మిమ్మల్ని గెలిపించుకొనే బాధ్యత మాది నన్ను చంపేసినా పర్వాలేదు. అమరావతి లోనే రాజధానిని ఉంచాలని డిమాండ్ చేశారు. 

మరి కర్కశంగా ..
అమరావతి మహిళలపై  పోలీసుల దాడి అమానుషమన్నారు. మహిళా పట్ల జగన్ ప్రభుత్వం మరి కర్కశంగా ప్రవర్తిస్తుందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు,‌ ఎంపిలు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొనాలని సూచించారు. మిమ్మల్ని గెలిపించుకొనే బాధ్యత మాది నన్ను చంపేసినా పర్వాలేదని భరోసా ఇచ్చారు. అమరావతి లోనే రాజధానిని ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. 
 


.

మరింత సమాచారం తెలుసుకోండి: