కాకినాడ పేరు చెప్పగానే ఏం గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా కాకినాడ కాజా మాత్రం తప్పకుండా గుర్తొస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవిదేశాల్లో కూడా కాకినాడ కాజాకు విశేష గుర్తింపు ఉంది. కాకినాడకు ప్రత్యేకమైన గుర్తింపు రావడంలో కాజా పాత్ర చాలా ఉంది. కోటయ్య అనే వ్యక్తి వెరైటీగా మరియు రుచిగా కాజాలను తయారు చేయటంతో ఆ కాజాలకు గుర్తింపు వచ్చింది. 
 
కాకినాడ కోటయ్య కాజాకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వ తపాలా శాఖ కాకినాడ కోటయ్య కాజా పేరుతో స్టాంపు కవర్ మరియు పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసింది. మనం తినే రకరకాల స్వీటులలో కాజా కూడా ఒకటి. కాకినాడ ప్రాంతంలో కోటయ్య అనే వ్యక్తి మొదటిసారి 1890 సంవత్సరంలో తయారుచేసిన గొట్టం కాజాకు కాజా ఎంతో రుచికరంగా ఉందన్న పేరొచ్చింది. ఒకసారి కాకినాడ కాజా తింటే ఆ కాజాను మరలా తినాలని చాలామంది తహతహలాడుతారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 
 
ఉభయ గోదావరి జిల్లా ప్రజలు కాకినాడ కాజా వలన ఆంధ్రుల గౌరవం మునుపటితో పోలిస్తే మరింతగా పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువాళ్లు కాకినాడకు వస్తే తప్పకుండా కాజాను కొనుగోలు చేసి వెళతారు. కాకినాడ కాజాకు ఉండే ప్రత్యేకమైన రుచి వలన ఆ కాజాకు కాకినాడ కోటయ్య కాజాగా గుర్తింపు వచ్చింది. 
 
కాకినాడ వాసులు కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వ తపాలా శాఖ ద్వారా అరుదైన గుర్తింపు రావడంపై కాకినాడ కోటయ్య కాజాను తయారు చేసే వారు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కాజాను ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ఆన్ లైన్ లో కాజాను ఆర్డర్ చేసి కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. కోటయ్య కాజా రుచి ఇప్పటివరకూ తెలియనివారు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఒకసారి రుచి చూడండి మరి... 

మరింత సమాచారం తెలుసుకోండి: