ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు లేనిపోని బడాయి లకు వెళ్లి చాలా మంది యువత ఉన్నది ఉన్నట్టు బతకకుండా నకిలీ బతుకు తో సమాజంలో బతికిన చచ్చినట్టు బతుకుతున్నారు. ఎక్కువగా యువత స్మార్ట్ ఫోన్ లు.. బైక్‌లు.. బెట్టింగులు పాల్పడుతూ అప్పుల పాలవుతున్నారు. వాస్తవ జీవితాన్ని మరుగు చేసి తమ కోరికల కోసం ఇతరులను సంతోష పెట్టడం కోసం ఇంట్లో వాళ్ళని బాధపెడుతూ బయట అప్పులు చేస్తూ కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటూ చివరికి అప్పులపాలవుతున్నారు.

 

అంతేకాకుండా కష్టపడాల్సిన వయసులో కష్టపడకుండా కష్టపడుతున్న తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని తమ సుఖాల కోసం వారి సొమ్మును వాడుకుంటూ అనేక మంది యువకులు మరియు యువతలు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల కన్నీరు కి కారణమవుతున్నారు. అంతేకాకుండా చదువుకోవాల్సిన వయస్సులో కాలేజీకి వెళ్లాల్సిన వయసులో పుస్తకాలతో పని ఎక్కువగా పెట్టుకోకుండా బైకులు అంటూ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులను స్థోమతకు మించి బైక్ కొనాలని తన ఫ్రెండ్స్ కి ఉన్న బైకు తనకి కూడా కావాలని ఇలా చాలా మంది యువకులు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వారి మానసిక క్షోభ కి కారణం  అవుతూ చివరాకరికి ఇంట్లో ఉన్న వాళ్ళతో అప్పులు చేయించి బైక్ కొని రాక్షస ఆనందం పొందుతున్నారు.

 

ఈ విధంగా వ్యవహరిస్తూ సమాజంలో ఉన్న యువతీ యువకులు బైకులు బెట్టింగులు అంటూ లేనిపోని ఆడంబరాలకు వెళుతూ చివరాఖరికి అప్పులపాలవుతున్నారు. అప్పులు కట్టుకోలేక ఇంట్లో ఉన్న వాళ్లకు సమస్యగా మారుతున్నారు. అంతేకాకుండా ఇంకా సమస్య తీవ్రమైతే మంచి యవ్వనం వయసులోనే కాటికి చేరుతూ ఎన్నో ఆశలు మరియు ఆకాంక్షలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న యువతరం ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను సంతోషపరిచే విధంగా వారికి స్తోమతకు తగ్గ విధంగా ఆలోచించి బయట సమాజంలో మెలిగితే బాగుంటుందని ఎవరో ఏదో కొన్నాడని మనం కూడా అలాగే బతకాలనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని అని...ఉన్నదాంట్లో సంతృప్తిగా బతకటం జీవితంలో నెగ్గడం వంటివి ఆలోచనలో పెట్టుకుని ముందుకు సాగితే జీవితంలో గెలిస్తే అదే తల్లిదండ్రులకు యువత అందించే పెద్ద విజయమని పెద్దలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: