ఏపీలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడబడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడుతూ బాబు సృష్టిస్తున్న గందరగోళంతో టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని, వయసు పైబడటం చాదస్తంతో ఆయన ప్రవర్తిస్తున్నారని అనుమానాలు అందరిలోనూ  కలుగుతున్నాయి. అధికార పార్టీ ఎంత మంచి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎంత పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నా చంద్రబాబు మాత్రం వాటిని స్వాగతించలేకపోతున్నాడు.ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తనవే అని చెప్పుకుంటున్నాడు.  


ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ కు మైలేజ్ రాకుండా చేసేందుకు తాపత్రయ పడుతున్న చంద్రబాబు అభివృద్ధి చేసింది నేనే అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులను ముందుండి నడిపిస్తున్నారని విమర్శలకు తావిస్తోంది. టిడిపి లోని కీలక నాయకులు కొంతమంది అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, మూడు రాజధానుల విషయమై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను తీసుకుంది. దీనిపై హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. అయితే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో సమాచారం అంతా సమగ్రంగా ఉన్నా చంద్రబాబు మాత్రం దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు.


 గతంలో ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ ఉన్న సమయంలో పరిపాలన, అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వడంతో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో రాజధాని ఏర్పాటు చేసేందుకు సరైన వసతులు కూడా లేకుండా పోయాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జగన్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో విశాఖ, కర్నూలు, అమరావతిలలో రాజధాని ఎంపిక చేశారు. దీనిపై ప్రజా ప్రయోజన సేకరణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రెండు కమిటీలు ఇచ్చిన సూచనలు, సలహాలను చంద్రబాబు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: