ప్రస్తుత తరంలో ఉన్న యువత అనేక విషయాలలో తప్పుదోవ పడుతూ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళనలకు గురి అవుతూ బ్యాలెన్స్ చేయలేని మైండ్ మరియు ఆలోచనలు లేక అతి చిన్న వయసులోనే పిరికి చర్య అయినా ఆత్మహత్యకు పాల్పడుతూ తమ జీవితాలను యవ్వన వయసులోనే ముగింపు పలుకుతున్నారు. అయితే ఎక్కువగా చదువుకోకుండా చదువుకోవాల్సిన వయస్సులో అలవాట్లకు బానిస అవుతూ సమాజానికి మరియు కుటుంబానికి చాలా ప్రమాదకరంగా మారుతూ ఇతరులకు ఎంతో ఇబ్బందికరంగా తయారవుతున్నారు యువత.

 

అతి చిన్న వయసులోనే డ్రగ్స్ మరియు మద్యం ఇలాంటివి అలవాటు చేసుకుంటే బానిసలై పోతున్నారు. చివరాకరికి ఇంట్లో ఉన్న కన్న తల్లిదండ్రులకు కష్టాలు కొని తెస్తు వాళ్ళ కన్నీటికి కారణం అవుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో చదువుకోకుండా కాలేజీ కి వెళ్లాల్సిన సమయం లో కాలేజీ కి వెళ్లకుండా చెడు స్నేహితులతో చెడ్డ అలవాట్లు అలవాటు చేసుకుంటూ వాటికి బానిస అయిపోయి వాటిలో నుండి బయటపడలేక నడివయసులోనే యువత తమ జీవిత ప్రయాణాన్ని ముగించేస్తున్నారు.

 

జీవితాలను కట్టుకోవలసిన సమయంలో అలవాట్లకు డ్రగ్స్ కి మద్యానికి బానిసై జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో అన్నీ అందుబాటులోకి రావడంతో తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న యువత సమాజంలో ఏ విధంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్న దాని విషయంలో ఏ మాత్రం కనీస గౌరవం లేకుండా పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వకుండా అడవిలోని జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

 

ముఖ్యంగా జీవితానికి సంబంధించి కీలకమైన విషయాలలో వారి సలహాలు సూచనలు తీసుకోకుండా చాలా మంది యువత తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టు కుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత సమాజంలో ఉన్న యువత పెద్ద వాళ్లకి గౌరవం ఇవ్వకుండా సమాజంలో బతకాల్సిన విధానంలో బతకకుండా ఇతరులకు ప్రమాదకరంగా మారుతు అర్ధాంతరంగా కొన్ని చెడు అలవాట్లతో తమ జీవితాలను ఎక్కువమంది ముగించేసి కుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: