అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించడమే కాకుండా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంతపురం మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా  అనంతపురం జిల్లాలో ఎప్పుడు జేసీ బ్రదర్స్ హవాకు అడ్డుకట్ట ఉండేది కాదు. దీంతో వారు  ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా రాజకీయం నడిపించేవాడు.అయితే వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన తరువాత జెసి బ్రదర్స్ హవాకు జగన్ గండికొట్టడమే కాకుండా వారిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగారు. 


తాజాగా ఓ కేసు నిమిత్తం స్టేషన్ కు జేసీ దివాకర రెడ్డిని ఎనిమిది గంటలపాటు పోలీస్ స్టేషన్ లో ఉంచేశారు.స్టేషన్ బెయిల్ తీసుకువెళ్లినా తనను ఎనిమిది గంటలపాటు పోలీస్ స్టేషన్లో ఉంచడంపై జెసి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి  మేమంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, మా రాజకీయ వ్యాపారాలు అన్నిటిలోనూ  జగన్ వేలు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని జెసి తీవ్రస్థాయిలో గరం గరం అవుతున్నారు. ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులను ఆర్టీవో అధికారులు సీజ్ చేశారు. దీనిపై జేసీ ఆగ్రహం ఇంకా చల్లారకముందే ఇప్పుడు ఇలా స్టేషన్ కు పిలిచి ఆయనను ఎనిమిది గంటలపాటు కూర్చోబెట్టడం ఒక సంచలనం సృష్టిస్తోంది.


 తాడిపత్రిలో పట్టణంలో అలజడులు సృష్టించేందుకు జేసీ వర్గీయులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం తెలియగానే పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా జేసీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారపార్టీకి పోలీసులంతా దాసోహమవుతున్నారని, రిమోట్ కంట్రోల్ శక్తి వారిని నడిపిస్తోందని, కోర్టులను, చట్టాలను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. జేసీ బ్రదర్స్ కి చెందిన అనేక వ్యాపారాలు, వ్యవహారాలను ప్రభుత్వం పూర్తిస్థాయి లో నిఘా పెట్టింది. దీని కారణంగానే జెసి ఈ రేంజ్లో లో ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: