తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ అధికారి తనకంటే క్రింది స్థాయి వ్యక్తితో దారుణంగా ప్రవర్తించటంపై ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం చేతిలో ఉందని ఒక ప్రభుత్వ అధికారి అటెండర్ పై పెత్తనం చెలాయించటం ఏంటని తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటెండర్ తో తంగళ్లపల్లి పీ.హెచ్.సీ సెంటర్ కు వచ్చిన ప్రభుత్వ అధికారి చెప్పులు శుభ్రం చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
డీఎంహెచ్ఓ అధికారి చంద్రశేఖర్ తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సమయంలో అధికారి తన చెప్పుపై కొన్ని మరకలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అటెండర్ ను పిలిచి తన చెప్పుపై ఉన్న మరకలను తుడిచి శుభ్రం చేయాలని చంద్రశేఖర్ ఆదేశించారు. డీఎంహెచ్ఓ అధికారి ఆదేశించటంతో చేసేదేం లేక అటెండర్ చెప్పులను శుభ్రం చేశారు. 
 
ఇది గమనించిన కొందరు స్థానిక యువకులు అటెండర్ చెప్పులను శుభ్రం చేయటాన్ని చిత్రీకరించారు. సోషల్ మీడియాలో యువకులు పోస్ట్ చేయటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న అమానుష ఘటన వైరల్ అవుతోంది. అటెండర్ ను ఈ విషయం గురించి ప్రశ్నిస్తే ఉన్నతాధికారి ఆదేశాలను తిరస్కరిస్తే తన ఉద్యోగానికే ప్రమాదం అని భయంతో చెప్పులను శుభ్రం చేసినట్లు చెప్పారు. 
 
కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటెండర్ చెప్పులు తుడిచిన ఘటన వైరల్ అవుతోంది. డీఎంహెచ్ఓ అధికారిని ఈ విషయం గురించి వివరణ కోరగా చెప్పులపై మరకలు పడ్డాయని అవి తుడవమని చెప్పానని అన్నారు. స్థానికులు డీఎంహెచ్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఉన్నతాధికారులు చంద్రశేఖర్ పై చర్యలు తీసుకుoటారా...? లేదా...? చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: