మనమంతా భారతీయులం అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ దేశ చరిత్ర ఎంతగా చెప్పుకున్న తరగనిది. ఈ పుడమి పై బ్రతికేవారి మతం వేరైనా, భాష వేరైనా మనమంతా భారతీయులమే అనే భావన ప్రతి వారిలో ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇక్కడి ప్రజలు ప్రవర్తిసారు కూడా. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అని అనటమే కాదు అప్పుడప్పుడు నిరూపించబడుతుంది.

 

 

ఇకపోతే కొందరు మత విద్వేషాలు సృష్టించి, మన ఐకమత్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. అయినా కూడా అలాంటి వారిని చెప్పుతో కొట్టినట్లుగా మన భారతీయులు బ్రతుకుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటనే ఉదాహరణ.  కేరళలోని అలప్పుఝా ప్రాంతంలో, మతాలకు అతీతంగా జరిగిన ఓ పెళ్లి ఆ జిల్లాకే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. అదేంటో తెలుసుకుంటే. కేరళలోని అలప్పుఝా ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తుంది.

 

 

అయితే ఆ కుటుంబ పెద్ద అయిన  అశోకన్ అనే వ్యక్తి 2018లో మరణించాడు. కాగా వారి కుటుంబం మసీదు దగ్గరి ప్రాంతంలో అద్దెకు ఉండటం వల్ల ఆ చుట్టుప్రక్కలి వారితో ఎంతో ఆప్యాయతగా మసలుకొనేవారట.. ఇక మరణించిన అశోకన్ కూతూరు పెళ్లి యీడుకు రావడం మూలాన, అశోకన్ భార్య బిందు, తన కూతురికి వివాహాం చేయాలని నిశ్చయించుకుంది. కానీ వారి ఆర్ధిక పరిస్దితి అంతంత మాత్రమే.

 

 

అందువల్ల తన కూతురి వివాహానికి సాయం చేయాలని మసీదు యాజమాన్యాన్ని కోరింది అశోకన్ భార్య. ఆమె అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేయడంతో అశోకన్, బిందుల కూతురు అయినా అంజూ, వివాహం శరత్ శశి అనే యువకునితో జనవరి 19న చేరువళ్లీ ముస్లిం జమాత్ మసీదులో ఉదయం 11గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల మధ్యలో జరిగింది..

 

 

ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడి ముస్లిం సోదరులు పెళ్లికి వచ్చిన దాదాపు 1000మంది వ్యక్తులకు వెజిటేరియన్ ఫుడ్ అందజేశారు. అంతే కాకుండా పెళ్లికూతురికి బంగారంతో పాటు.. రూ.2లక్షల నగదు కూడా వారు అందజేశారట. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి మంచిపనులు, మన ఐకమత్యం చాటే ఘటనలు ప్రతి చోట జరిగితే ఉగ్రవాదులకు కొంతైన సిగ్గువస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: