చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్ధితి ఇలాగైపోయిందేమిటి ? రాజధాని గ్రామాల్లోని రైతులు చంద్రబాబానాయుడుకు పెద్ద షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై 18 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది చంద్రబాబును చాలా లైట్ గా తీసుకున్నారని సమాచారం. రాజధాని కోసం 29 గ్రామాల్లోని రైతులు భూములిచ్చిన విషయం తెలిసిందే.

 

అయితే ఇపుడు ఆందోళన జరుగుతున్నది ఓ ఐదారు గ్రామాల్లో మాత్రమే.  మరి మిగిలిన గ్రామాల్లోని రైతులు ఎందుకు ఆందోళనను పట్టించుకోవటం లేదు ? ఎందుకంటే  ఇప్పటికే అమరావతి వివాదమంతా  కమ్మ సామాజికవర్గం వల్లే మొదలైన కంపుగా ఆరోపణలు వినబడుతున్నాయి. దానికి తోడు ప్రతిరోజు చంద్రబాబో లేకపోతే టిడిపి నేతలో వచ్చి రైతులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

 

జరుగుతున్న వ్యవహారాలతో  ఇదేదో కమ్మోరి సమస్య అనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో  ఎన్ని ఆందోళనలు చేసినా రాజధానిని విశాఖపట్నంకు తరలించుకుపోవటం ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే మిగిలిన గ్రామాల్లోని రైతులు ఆందోళనల విషయంలో చంద్రబాబు పిలుపుకు  స్పందించటం లేదని అర్ధమైపోతోంది.

 

అదే సమయంలో తాజాగా  మొదలైన వివాదం చంద్రబాబు చేతకానితనం వల్లే జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక్క శాస్వత భవనం కూడా కట్టటం చేతకాని చంద్రబాబు ప్రపంచస్ధాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి అందరినీ మోసం చేయటంతోనే ఈ దరిద్రమంతా మొదలైందని చాలా గ్రామాల్లోని రైతులకు ఇప్పటికే అర్ధమైపోయింది.

 

ఉన్న కొద్దిపాటి వనరులనే సమర్ధవంతంగా వినియోగించుకుని శాస్వత భవనాలే కట్టేసుంటే ఇపుడీ సమస్య తలెత్తేది కాదని ప్రచారం ఊపందుకుంటోంది. రాజధాని నిర్మాణం ముసుగులో మొత్తం తన సామాజికవర్గం, టిడిపిలోని కీలక వ్యక్తుల ప్రయోజనాలే ధ్యేయంగా చంద్రబాబు పని చేసిన విషయం తెలిసిందే. అటువంటి చంద్రబాబే ఇపుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మళ్ళీ రైతులను రెచ్చగొడుతున్న కారణంగానే దూరంగా ఉంటున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: