ఆపరేషన్ గరుడ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రోజుకో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకు వస్తూ వైసిపి, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు శివాజీ. ఏపీపై టిడిపి, బీజేపీ ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారు అనే విషయాన్ని బోర్డు మీద రాసి మరి చూపిస్తూ అప్పట్లో శివాజీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికార పార్టీ మద్దతు తనకు ఉంది అన్నధీమాతో అప్పట్లో శివాజీ ఇష్టమొచ్చినట్లుగా బిజెపి, వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో ఆయన వ్యవహారం అనేక విమర్శలతో కారణమైంది.


 అలాగే టీవీ9 రవి ప్రకాష్ తో కలిసి ఆ సంస్థలో పెట్టుబడులు విషయంలోనూ అనేక ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటన చేస్తూ బిజెపి అగ్రనాయకులు మోదీ, అమిత్ షా పై శివాజీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీ9 కేసుల వ్యవహారంలో ఇరుక్కుని విదేశాలకు పారిపోతుండగా  ఆయన పోలీసులకు దొరికిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి ఆరు నెలలుగా కనిపించని శివాజీ మళ్లీ ఇప్పుడు రాజధాని గా అమరావతిని కొనసాగించాలంటూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. 


వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ సంధర్బంగా ఓ స్టూడియోలో మాట్లాడుతుండగా ఓ కాలర్ ఫోన్ చేసి శివాజీ గతంలో ఆయన వ్యవహరించిన తీరుపై, సొంత చెల్లెలు లాంటి అమ్మాయిని లేపుకెళ్లి పోయాడని ఇలాంటి వ్యక్తిని స్టూడియోలో కి తీసుకు రాకూడదు అని ఆ  కాలర్ మాట్లాడుతుండగానే శివాజీ దారుణంగా అసభ్యకరమైన బూతు పదం వాడటంతో విషయం పెద్దదైయ్యింది. దీంతో ఆ న్యూస్ ఛానల్ వారు ఆ ఫోన్ కాల్ ను కట్ చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ఫోన్ కాలర్ ఆ స్టూడియో యాజమాన్యానికి ఫోన్ చేసి శివాజీపై కేసు పెడుతున్న అని ఆ ఫోన్ కాల్ రికార్డు జాగ్రత్త చేయలని చెప్పినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: