గ్రేటర్ హైద‌రాబాద్‌ మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డు పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారీ అపార్ట్‌మెంట్లు, ఆకాశ హార్మ్యాలు, లగ్జరీ విల్లాలు తదితర భవన సముదాయాలతో రద్దీ ప్రాంతాలుగా మారుతున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఐఎస్‌బీ రోడ్‌ , ల్యాంకో హిల్స్‌, వేవ్‌రాక్‌, కోకాపేట లాంటి ముఖ్య ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఔటర్‌కు ఇరువైపులా ఖానాపూర్‌, బాబుఖాన్‌ ఏరినా, గోల్డెన్‌ ఫిష్‌, రాజపుష్ప , మై హోం లాంటి ప్రముఖ సంస్థల నిర్మాణాలు, మరో వైపు అపార్ట్‌మెంట్‌, ఇంటిపెండెంట్ నివాసాల‌తో మినీ నగరాన్ని తలపిస్తోంది. ఈ మినీ న‌గ‌రానికి మ‌రో తీపిక‌బురు జోడికానుంది.

 

ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలుండడం, ప్రస్తుతం కోకాపేట, టీఎస్‌పీఏ, కిస్మత్‌పుర, మంచిరేవుల, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌పైన ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా పడుతుంది. టీఎస్‌పీఏ నుంచి కొల్లూరు జంక్షన్‌ సర్వీస్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ఐటీ, ఇతర కంపెనీలలో ఉద్యోగాల నిమిత్తం ఐఎస్‌బీ రోడ్‌ నుంచి కోకాపేట వైపునకు వెళ్లాలంటే కష్టసాధ్యంగా మారింది. మధ్యలో ఉన్న ఔటర్‌కు ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్ళాలంటే నార్సింగి వరకు సుదూర ప్రయాణం చేయాల్సి రావడం, ఇరుకైన సర్వీస్‌ రోడ్‌ ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్‌ సిటీ ట్రాఫిక్‌ను తలపిస్తున్నది. భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండటంతో ప్రయాణం సాఫీగా సాగేలా ఓవర్‌పాస్‌ నిర్మాణాలపై అడుగులు వేస్తున్నారు.

 

 

ణం కష్టసాధ్యంగా మారిన తరుణంలో నార్సిం గి, పెద్ద అంబర్‌పేట తరహాలో ఔటర్‌ మీదుగా ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఫ్యూచర్‌ సిటీగా మారబోతున్న కోకాపేటకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు గ్రేడ్‌ సపరేటర్‌ లాంటి నిర్మాణాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 19 ఇంటర్‌చేంజ్‌లకు అదనంగా రెండు చోట్ల నార్సింగి, జన్‌వాడ వద్ద ఏర్పాటు చేయాలని, జన్‌వాడ వద్ద ఓవర్‌పాస్‌ (నార్సింగి తరహాలో) ఇంటర్‌ చేంజ్‌ , నార్సింగి ఓవర్‌పాస్‌ వద్ద ఇంటర్‌ చేంజ్‌లను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టవర్స్‌ నుంచి కోకాపేట లే అవుట్‌ వైపు రోడ్డు మార్గాన్ని కలిపి ఔటర్‌ మీదుగా ప్రయాణానికి వీలుగా ఓవర్‌పాస్‌ల నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. ఇదే సమయంలో కోకాపేట పడమర వైపున ఓవర్‌పాస్‌ నిర్మాణం, ల్యాంకోహిల్స్‌- ఎస్‌బీరోడ్‌లోనూ ఓవర్‌పాస్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: