పొట్ట కూటి కోసం గుజరాత్‌ కి వలస వెళ్లిన ఉత్తరాంధ్ర జాలర్లు దురదృష్ట వశాత్తు పాకిస్తాన్ చేతికి చిక్కారు. 2018 డిసెంబర్‌ లో పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించడంతో అప్పటి పాకిస్తాన్‌ నౌకాదళం  సిబ్బంది వారిని అరెస్టు చేసింది. అప్పటి నుంచి వారంతా పాకిస్తాన్‌ జైలులో వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఏపీ కి చెందిన జాలర్లను విడుదల చేయించాలని ఏపీ ఎంపీలు కేంద్ర విదేశాంగ మంత్రి జయ శంకర్‌ కి లేఖలు రాశారు. జాలర్లను విడిపించాలని కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరపడంతో కేంద్రం స్పందించింది.


కేంద్ర విదేశాంగ శాఖ చొరవ తో పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న ఉత్తరాంధ్ర జాలర్లకు ఇప్పుడు విముక్తి లభించింది. జైలులో ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి వారిని విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద వారిని భారత అధికారులకు అప్పగించనున్నారు. 


దీంతో కేంద్ర విదేశాంగ శాఖ పాకిస్తాన్‌ తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్ల ను విడిచి పెట్టాలని పాకిస్తాన్ ను కోరింది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. 20 మంది మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్‌ ఓకే చెప్పింది. ఈ నెల 6 న సోమవారం వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు 20 మంది మత్స్యకారులను అప్పగిస్తామని పాకిస్తాన్‌ ప్రభుత్వం పేర్కొంది.


ఏపీ జాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం ఈ రోజు లాండి జైలు నుంచి విడుదల చేసింది. ఆ మత్స్యకారులను రేపు సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ వాఘా సరిహద్దుకు బయలు దేరి వెళ్లారు. ఉత్తరాంధ్ర జాలర్లను అప్పగించిన అనంతరం మోపిదేవి జాలర్లను రాష్ట్రానికి తీసుకొస్తారు. అందుకోసం ఆయన ఆదివారం బయలు దేరి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: