2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. వరుస షాకులతో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతోంది. తెలుగుదేశం పార్టీలోని కీలకనేతలు ఇతర పార్టీల్లో చేరుతూ చంద్రబాబుకు వరుస షాకులిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పటంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. 
 
నాదెండ్ల బ్రహ్మం చౌదరి తాను వ్యక్తిగత కారణాల వలన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నానని తాను రాజీనామా చేయడానికి రాజకీయపరమైన కారణాలేవీ లేవని స్పష్టం చేశారు. పార్టీ నుండి వెళ్లిపోతున్నానని చెప్పినప్పటికీ చంద్రబాబుపై మాత్రం బ్రహ్మం చౌదరి పొగడ్తల వర్షం కురిపించారు. తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని చంద్రబాబు వెన్నుతట్టి తనను ప్రోత్సహించారని చెప్పారు. 
 
తాను రాజీనామా చేయడానికి ఎటువంటి రాజకీయ కారణాలు లేవని రాజీనామా తన సొంత నిర్ణయం అని చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాడాలనే ఆలోచనతో పార్టీకి రాజీనామా చేశానని రాజీనామా విషయంలో ఎవరి ప్రమేయం లేదని బ్రహ్మం చౌదరి స్పష్టం చేశారు. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీడీపీ అనుబంధ విభాగాల్లో ముఖ్యమైనది. తెలుగుదేశం పార్టీలోకి విద్యార్థి దశ నుండే యువత పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ దోహదపడుతుంది. 
 
ఇలాంటి ముఖ్యమైన పదవికి నాదెండ్ల బ్రహ్మం చౌదరి గుడ్ బై చెప్పటం తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన సమయంలో దేవినేని అవినాష్ తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఉన్నారు. వరుసగా టీడీపీ పార్టీకి యువనేతలు షాకుల మీద షాకులు ఇస్తూ ఉండటంతో టీడీపీ పార్టీ రోజురోజుకు బలహీనపడుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: