పెళ్లి అనే ఏడడుగుల బందాన్ని కొందరు ఏడురోజులు కూడా నిలుపుకోవడం లేదు. ఇక మరికొందరు పెళ్లిపేరు చెప్పుకుని అడ్డదార్లో ప్రయాణిస్తుండంగా, మరికొందరు పెళ్లిచాటున మోసాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా భార్యభర్తల సంబందాన్ని చిత్తుకాగితంలా భావిస్తున్న వారు కూడా ఈ వ్యవస్దలో ఉన్నారు. ఇక ఈ మద్యకాలంలో జరిగే మోసాలను చూస్తే అసలు పెళ్లి అంటేనే భయపడే రోజులు వచ్చాయి.

 

 

ఆ మద్య వచ్చిన వార్త. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కూడా చేసుకుని ఆ అబ్బాయి దగ్గర ఉన్న నగలు, డబ్బుతో ఉడాయించింది. ఇలాంటి ఘటనలు అడపాదడపా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాళ్లి అంటే ఎగతాళి అయ్యింది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోమోయే విషయం ఏంటంటే ఇదో కొత్త తరహ మోసం. ఆ మోసానికి వేదికలుగా మ్యాట్రిమొనీ సైట్స్ మారాయి. ఎందుకంటే పెళ్లి కాని యువతి యువకులు ఈ మ్యాట్రిమొనీ సైట్స్ లో వివరాలు నమోదు చేసుకుని పెళ్లిలూ కుదుర్చుకుంటున్నారు.

 

 

అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాహ సంబంధాల కారణంగా మోసపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది... ఎందుకంటే ఇలా చూసుకున్న సంబందాలల్లో ముఖ్యంగా ఒకరిగురించి ఒకరికి తెలియకపోవడం పెళ్లి చేసుకునే కుటుంబాల గురించి అసలు పట్టించుకోక పోవడం. వలన వివాహం తర్వాత చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.. కొంత మంది పెళ్లికి సిద్ధపడి నిశ్చితార్థం చేసుకున్నాక కూడా మోసపోతున్నారు. ఇదిగో ఇప్పుడు  ఇలాంటి ఘటనే బెంగుళూరు లో జరిగింది..

 

 

నిశ్చితార్ధం అంతా చేసుకొని పెళ్ళికి రెడీ అయిన తర్వాత ఓ యువతీ నీ ముక్కు భాగోలేదు అని సంబంధం లేని రీజన్ చెప్పిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఆ వివరాలు చూస్తే. బెంగళూరుకు చెందిన టెకీ జ్యోతిప్రకాష్‌కు ఓ మ్యాట్రి మోనియల్ సైట్ ద్వారా హిమబిందు అనే యువతి పరిచయమైంది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.  

 

 

ఆ యువతి కోరిక ప్రకారం ఇరు కుటుంబ పెద్దలూ జనవరి 30న వీరికి తిరుమలలో వివాహం చేయాలని నిశ్చయించారు. అయితే పెళ్లికొడుకు వారు, పెళ్లి కోసం తిరుమలలో 70 రూములు కూడా బుక్ చేశారు. అంతే కాకుండా నాలుగ లక్షల రూపాయలు పెట్టి కొత్త బట్టలు  తీసుకున్నారట. ఇంతలో పెళ్లి కూతురు  ప్రకాష్ కి ఫోన్ చేసి తనకి పెళ్లి ఇష్టం లేదని కావున ఈ పెళ్లి రద్దని చెప్పిందట. అయితే ఆ అబ్బాయి పెళ్లి ఎందుకు ఇష్టం లేదని అడగ్గా, నీ ముక్కు పెద్దగా ఉండటమే కారణం అని చెప్పి  తప్పించుకుందట.. దీంతో తాము మోసపోయామని గ్రహించి పెళ్లి కొడుకు వారు పోలీసులని ఆశ్రయించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: