మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జేసీ దివాకర్ రెడ్డి తాను ప్రాంతీయ పార్టీల్లోనే కొనసాగుతానని చెబుతూనే బీజేపీ పార్టీలో కూడా చేరే అవకాశం ఉన్నట్టు చెప్పారు. శనివారం రోజున అనంతపురం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు ఏడు గంటల పాటు జైలులో ఉంచిన విషయం తెలిసిందే. 
 
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేయడం బీజేపీ పార్టీ నేత సత్య కుమార్ ను జేసీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జేసీ దివాకర్ రెడ్డి సత్య కుమార్ తో వివిధ అంశాల గురించి చర్చించారు. సోమవారం రోజున జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలో ఉన్న కిషన్ రెడ్డి తో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ వర్గాల్లో జేసీ బీజేపీ నేతలలో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. 
 
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలే కీలకమని వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి తాను మాత్రం ప్రాంతీయ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ప్రధాని మోదీ స్వాధీనం చేసుకుంటే మాత్రం తాను బీజేపీలో చేరతానని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటే బీజేపీ పార్టీలో చేరే తొలి వ్యక్తిని తానేనని దివాకర్ రెడ్డి స్పష్టతనిచ్చారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తానని జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసుపై శనివారం రోజున ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన జేసీని దాదాపు 7 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఆ తరువాత జేసీ అభిమానులు ఆందోళనకు దిగడం ఒకరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఆ తరువాత జేసీని పోలీసులు వదిలేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: