అమరావతిలో రాజధాని మార్పు పై నిరసనలు ఉవ్వెత్తున  ఎగసి పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు అందరు తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో అమరావతి మొత్తం రైతుల నిరసన తో అట్టుడికిపోతోంది. అంతేకాకుండా రైతుల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారి తీస్తున్నాయి. అటు ప్రభుత్వం రాజధాని అధ్యయనం కోసం నియమించిన రెండు కమిటీలు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉండటంతో  అమరావతి రైతులు అందరూ ఆ రెండు నివేదికలను తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ప్రజాభిప్రాయ లను అధ్యయన కమిటీ సభ్యులు ఎప్పుడు ఎక్కడ స్వీకరించారు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

 

 అంతే కాకుండా అటు ప్రతిపక్ష నాయకులందరూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అధ్యయనం కోసం నియమించిన కమిటీ లు ఇచ్చిన నివేదికలన్ని  ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారమే ఇచ్చాయి అంటూ ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ క్రమంలో  జేఏసీ ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంటర్లో నిర్వహించిన మన రాజధాని మన అమరావతి నిరసన కార్యక్రమంలో టిడిపి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రాజధాని పేరుతో వైసీపీ నేతలందరూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఆరోపించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై వారం రోజుల్లోనే నివేదికలు ఎలా వచ్చాయో తనకు మాత్రం అంతుబట్టడంలేదు అంటూ ఆయన విమర్శించారు. అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మద్దతు ఉందని తెలిపిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు... ఒక్క వైసీపీ మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉంది అంటూ విమర్శించారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖలో రాజధాని పెడుతున్నట్లు తనకనిపిస్తోందని ఆయన అన్నారు. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాజధాని తరలించవద్దని అమరావతి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న... కుటుంబంతో సహా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: