తండ్రి అంటే పిల్లలకు దారి చూపే వెలుగు లాంటి వాడనే అర్దాన్ని రోజు రోజుకు కొందరు మూర్ఖులు చెరిపివేస్తున్నారు. అనుమానం పెనుభూతం అనే అర్దాన్ని నిజం చేస్తున్నారు. ఎదురయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి మరీ చూస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు సమాజంలో ప్రతి చోట కనిపిస్తున్నారు.

 

 

పైకి మాత్రం నవ్వూతూ కనిపిస్తూనే లోలోన మాత్రం ఉన్మాది లక్షణాలను  ఇముడ్చుకుని కౄరంగా ప్రవర్తిస్తున్నారు.  ఇక ఈ లోకంలో ముద్దులొలికే చిన్న పిల్లలంటే ఇష్టపడని వారుంటారా...  పసిపిల్లలు మనవారు కాకపోయినా వారు కనిపించగానే ప్రేమగా దగ్గరికి తీసుకుని, వారితో కాసేపు ఆడుకుంటే మనసులోని బాధలు ఏవైన ఉంటే చిటికెలో మాయం అవుతాయి. అందుకే అన్నారు కాకిపిల్ల కాకి కి ముద్దు అని. ఎందుకంటే ఎవరి పిల్లలు వారికి ముద్దు. కాని ఇక్కడొక కర్కోటకుడైన తండ్రి ముద్దులొలికే తన బిడ్డను చూసి మురిసిపోవాల్సింది పోయి... తనకు పుట్టిందో లేదోననే సందేహంతో ఉన్మాదిగా మారి అభంశుభం ఎరుగని ఆ పసిదాన్ని హత్యచేశాడు.

 

 

ఇంతటి దారుణమైన ఘటన జరిగింది కడప జిల్లాలోని, వేంపల్లె మండలంలో.. ఇక పోలీసుల కథనం ప్రకారం... వేంపల్లె మండలంలోని నందిపల్లె గ్రామానికి చెందిన ఖుషీదా, మునీంద్రకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా, వీరి మద్య విభేదాలు తలెత్తడం వల్ల విడిపోయారు. అయితే వీరికి మొదటి సంతానంగా కుమారుడు ఉన్నాడు. ఇక ఒంటరిగా ఉంటున్న ఖుషీదాకు ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన గజేంద్రతో మళ్లీ వివాహమైంది. వీరు వేంపల్లెలోని రాజీవ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు.

 

 

కాగా మూడు నెలల క్రితం ఖుషీదా కు ఆడబిడ్డ జన్మించింది. ఆ సమయంలో సంతోషించవలసిన భర్త గజేంద్ర భార్యపై అనుమానం పెంచుకుని, ఆ బిడ్డ తనకు పుట్టలేదని సందేహిస్తూ భార్యను చిత్రహింసలు పెట్టేవాడట. ఇదిలా ఉండగా నందిపల్లెలోని తన తల్లిదండ్రులకు చూపించి వస్తానని ఈ నెల 3న బిడ్డను తీసుకెళ్లి, రాత్రి పొద్దుపోయే దాకా ఇంటికి రాలేదు.  

 

 

ఆందోళన చెందిన ఖుషీదా పోలీసుస్టేషన్‌కు వెళ్లి బిడ్డ, భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసే సమయంలోనే, గజేంద్ర వేంపల్లె వీఆర్వో ఎదుట లొంగిపోగా, అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యపై అనుమానంతో బిడ్డను పాపఘ్నినది దగ్గరకు తీసుకెళ్లి ముక్కుమూసి చంపి, ఇసుకలో పూడ్చిపెట్టినట్లు నేరం ఒప్పుకొన్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: