చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతుంటారు. సాధ్యమైనంత వరకు తమ పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఇంకా బాగా చదువుకొని.. మంచి జాబ్ చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడాలని కోరుకుంటుంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం పెళ్లి చేసి పంపించేయాలనుకుంటారు, దాంతో అమ్మాయి కన్నా కలలన్ని నెరవేరకుండా పోతాయి. కొంతమంది అమ్మాయిలు మాత్రం తమ లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ లక్ష్యాలను సాధించడం కోసం తమ తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తుంటారు. లేకపోతే, ఇంట్లోనుంచి పారిపోతారు. అలాంటి సంఘటనే ఒకటి ప్రకాశం జిల్లాలో చోటుచేసుకొని కలకలం రేపుతోంది.


వివరాల్లోకి వెళితే తన మాటకు విలువ లేకుండా తన కోరికలను నాశనం చేసి తన జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నారనే కోపంతో ఒక 19 ఏళ్ల యువతి తన ఇంటిలో నుంచి పారిపోయింది. దాంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. అసలే రోజులు బాగాలేదు మందుబాబులు యదేచ్ఛగా తిరుగుతూ ఏ అమ్మాయి కనిపించిన మానభంగం చేయాలనుకునే ఈ పాడు లోకం లో తన అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తారనే భయంతో వాళ్ల తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దాంతో తన బిడ్డ కోసం తిరగని చోటంటూ లేకుండా వెతికారు కానీ అమ్మాయి ఆచూకీ మాత్రం లభించలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించగా... వారి బాధను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకొని అమ్మాయి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. యువతి ఫోన్ స్విచాఫ్ అవడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.


చివరికి మరొక తెలివైన రీతిలో టెక్నాలజీని ఉపయోగించి ఈ 19 ఏళ్ల యువతి తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆ 19 ఏళ్ల యువతిని తన స్నేహితురాలు ఇంటి నుంచి తీసుకొని వచ్చి తమ తల్లిదండ్రులకు అప్పగించగా అప్పుడు తన కూతురు మొహం చూసిన ఆ తల్లిదండ్రులకు కంట కన్నీళ్లు టపటప రాలాయి. దాంతో తన బిడ్డను కౌగలించుకొని పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు ఆ యువతి తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: