మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అమ్మాయి కాలు బయట పెడితే చాలు మళ్ళీ తిరిగి ఇంటికి ఎలా వస్తారో   అన్న భయం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చదువు చెప్పే గురువుల నుంచి... రోడ్డు మీద ఉండి ఆకతాయిల నుంచి.. ఇంట్లో ఉండే సొంత వారి  నుంచి  ఇలా ప్రతీ చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు మహిళలు. రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా... మహిళలపై లైంగిక వేధింపులు తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి. 

 

 

 ఇప్పటికే ప్రతి చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు మహిళలు. మహిళల జీవితం అంటే  ఇంత ప్రశ్నార్ధకంగా ఉంటుంద అని బాధపడుతూనే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. మహిళలు కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి రాక్షసుల ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామాంధులు . రోజురోజుకు సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఇక్కడ మైనర్ బాలికపై అసొంకు చెందిన ఎస్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. కర్బి ఆంగ్లాంగ్ పట్టణానికి చెందిన ఎస్పీ గౌరవ ఉపాధ్యాయ్  ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. 

 

 

 స్వయంగా బాలికే  తనపై అత్యాచారం జరిగింది అని ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఎస్పీ గౌరవ ఉపాధ్యాయ్ పోక్సో  చట్టం లోని సెక్షన్ 10 కింద కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్లు  ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా మహిళలందరికీ రక్షణ కల్పించే బాధ్యత గల ఎస్పీ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో అస్సోం రాష్ట్రం మొత్తం ఎస్పి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అట్టుడుకుతోంది. కానీ ఈ కేసును తనపై కక్ష సాధింపు కోసమే పెట్టారు అంటూ గౌరవ ఉపాధ్యాయ్  వ్యాఖ్యానించడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: