టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకో విపరీతంగా ఫ్రస్టేషన్ కు గురవుతున్నట్టు కనిపిస్తోంది. పాపం. ఆ ఫస్ట్రేషన్ లో నోరు తరచూ జారుతున్నారు. ఓ మాజీ ఐఎస్ ఆఫీసర్ ను పట్టుకుని.. ఆయనో పనికిమాలిన వాడు.. నాదగ్గరే పని చేశాడు.. నువ్వు పనికిమాలిన వాడివని.. ఆయనే చెప్పా.. అంటూ ఇటీవల జీఎన్ రావు పై రెచ్చిపోయారు. ఆ తర్వాత మరో దళిత ఐఏఎస్ విజయ కుమార్ పై మాట్లాడుతూ.. వాడు చెప్పేదేంటి అంటూ నోరు జారారు.

 

గతంలో చంద్రబాబు కేసీఆర్ ను కూడా తరచూ ఇలాగే అనేవారు.. కేసీఆర్ .. చెప్పండి తమ్ముళ్లూ ఈ కేసీఆర్ ఎక్కడ పని చేసేవాడు.. నా దగ్గరే పని చేశాడు.. ఇప్పడు నన్నే అంటున్నాడు.. అంటూ తరచూ ఎన్నికల ప్రసంగాల్లో చెప్పేవారు.. కానీ ఏమైంది.. అదే కేసీఆర్ రెండోసారి తెలంగాణ సీఎం అయితే.. ఇక్కడ చంద్రబాబు కేవలం 23 సీట్లు గెలుచుకుని అధికారం చేజార్చుకుని... పాతాళానికి పడిపోయారు.

 

దీనికంతటికీ చంద్రబాబు అహంకారమే కారణమంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా స్థాయి మరిచి చంద్రబాబు దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను రాజకీయ నేతగా బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరుతామని ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావును పనికిమాలిన వాడు అంటూ చంద్రబాబు మాట్లాడారని సుధాకర్‌బాబు గుర్తు చేశారు.

 

దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ చేసిన తప్పేంటి. మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. బాబు రాజకీయ కుట్రలో రాజధాని రైతులు చిక్కుకోవద్దు. మూడు రాజధానులు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ ప్రతినిధులు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. గరుడ పురాణం శివాజీ, పవన్ కల్యాణ్ బాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. ఏడు నెలలుగా జాడలేని గరుడ పురాణం శివాజీ బాబు స్క్రిప్ట్‌ చదివేందుకు బయటకు వచ్చారు’అంటూ సుధాకర్ బాబు విమర్శించారు. మరి ఆ అవకాశం ఇచ్చింది చంద్రబాబే కదా.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: