కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఉధృతం గా మారుతున్నాయి. ఏకంగా ఆందోళనకారులు అందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే ఆందోళనకారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్న యూపీ సర్కార్.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆందోళనకారులను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న  నిరసనలతో అట్టుడుకుతోంది. మరోవైపు బిజెపి ఇతర రాష్ట్రాల సీఎంల అందరూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పి నిరసనలు తెలుపుతున్నారు. 

 

 

 

 అయితే మొదటి నుంచి పక్కా హిందుత్వ వాది అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో మరోసారి ముందడుగు వేశారు. తమ రాష్ట్రంలోనే ముందుగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఇప్పటికే ఒక కలెక్టర్ కు  పౌరసత్వ సవరణ చట్టం సర్టిఫికెట్లను జారీ చేసింది యూపీ సర్కార్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత హింస కారణంగా భారతదేశానికి వచ్చిన క్రిస్టియన్లు సిక్కులు పార్సీలు జైనులు ఎక్కడ ఎక్కడ ఉన్నారు అనే దాని గుర్తించి.. ఎప్పటి నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉంటున్నారో  లెక్కలు తీయాల్సిందిగా  కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది యూపీఏ సర్కార్.ఇలా  చేయడంవల్ల అక్రమ చొరబాటుదారులను గుర్తించ వచ్చు అని యూపీ సర్కార్ నిర్ణయించింది. 

 

 

 

 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధి తో మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థులు అని గుర్తించి వారికి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులు ఉన్నారని గుర్తించే ప్రక్రియ మొదలు పెటామని  ఆయన తెలిపారు. యూపీ సర్కారు మొదలుపెట్టింది అంటే మిగతా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని దీంతో వారు కూడా ముందుకు వస్తారని తెలిపారు. అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపడం అనేది ప్రక్రియ పక్కనపెడితే... రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి తో వాళ్లకు వాళ్లే సొంతంగా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్లి పోతారు అంటూ యూపీ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: