అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని ఒకవైపు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో గొడవలు జరుగుతున్న సమయంలోనే నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. చౌదరి తెలుగునాడు స్టూడెంట్స్ యూనియన్  రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం చంద్రబాబు అన్న మాటలతో మనస్తాపం చెందిన చౌదరి వెంటనే రాజీనామా చేశాడనే ప్రచారం జరుగుతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన 18 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళన అందరికీ తెలిసిందే.  రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిచ్చినా ఆందోళనలు జరుగుతున్నది మాత్రం కేవలం ఐదారు గ్రామాల్లోనే. ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా చేయించే ఉద్దేశ్యంతో చంద్రబాబు చౌదరిని పిలిపించుకుని ఉద్యమాలు చేయమని ఆదేశించారట.

 

అయితే  చంద్రబాబు ఆదేశాలను చౌదరి వివిధ జిల్లాల్లోని యూనియన్ ముఖ్యులతో మాట్లాడినా వారిలో పెద్దగా స్పందన కనబడలేదని సమాచారం. అదే సమయంలో  అమరావతి గుంటూరు జిల్లాలోని విద్యార్ధి విభాగంలో కూడా పెద్దగా స్పందన కనబడలేదట. అందుకనే రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనల్లో విద్యార్ధుల పాత్ర ఎక్కడా కనబడటం లేదు.

 

తన ఆదేశాలను పాటించని చౌదరిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతో మనస్తాపానికి గురైన బ్రహ్మం చౌదరి వెంటనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.  జనాల్లో లేని వ్యతిరేకతను తాను మాత్రం ఎలా పుట్టించగలనని చౌదరి వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

 

ఎందుకంటే స్వయంగా చంద్రబాబే రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నా రైతుల్లోనే పెద్దగ స్పందన కనపించటం లేదు. అలాంటిది తాను చెబితే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా ఆందోళనలు చేస్తారన్నది చౌదరి పాయింట్. ఈ తలనొప్పులన్నీ తనకెందుకులే అనుకునే చివరకు బ్రహ్మం చౌదరి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారట. చౌదరి రాజీనామాతో చంద్రబాబుకు షాక్ కొట్టిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: