మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లను ప్రకటించారు అధికారులు. మేడ్చల్ లోని నాలుగు కార్పొరేషన్ మునిసిపల్ చైర్మన్ స్థానాలకు కూడా రిజర్వేషన్లు వెల్లడించారు, ఈ నాలుగు కార్పొరేషన్లలో నిజాంపేట కార్పొరేషన్కు జనరల్ మహిళ, జోహార్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, బోడుప్పల్ పీర్జాదిగూడ కార్పొరేషన్లకు జనరల్ స్థానాలుగా ప్రకటించారు, ఇక 9 మున్సిపాలిటీ స్థానాల్లో నాలుగు స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించిన ఐదు స్థానాలను జనరల్  స్థానాలని  ప్రకటించారు  అధికారులు. అంతేకాకుండా మొత్తం నాలుగు కార్పొరేషన్ల పరిధిలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా 289 వార్డులున్నాయి. ఇందులో ఎస్టీలకు 13, బీసీలకు 97, మహిళలకు 84 జనరల్ అభ్యర్థులకు అరవై రెండు స్థానాలను కేటాయించారు అధికారులు. 

 

 

 కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 వార్డ్ ఉండగా చైర్ పర్సన్ పదవిని ఓపెన్ క్యాటగిరిలో  కేటాయించగా...  వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా ఇలా ఉన్నాయి 1,7,8,10,11,12వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా... బీసీ మహిళలకు 5,15,17 వార్డులను  కేటాయించారు. ఇక 18వ వార్డు ఎస్టి జనరల్గా, 14వ వార్డు ఎస్సి జనరల్గా... 2,6,13,16 వార్డులను బీసి జనరల్ కేటాయించగా.. మిగిలిన స్థానాలైన 3,4,9 వార్డు లో ఓపెన్ కేటగిరీని ప్రకటించారు. 

 

 

 మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ చైర్మెన్ జనరల్ కేటగిరీ కి చేయగా .. మున్సిపాలిటీ లో ఇరవై మూడు వార్డులు ఉండగా 6,8,15,23 వార్డులో బీసీ జనరల్.. 2,17,18 వార్డుల్లో బీసీ మహిళ...  1, 9,12,16,20,21,22 వార్డుల్లో జనరల్ మహిళ.. 5,10,13,14,19 వార్డులో జనరల్ 11వ వార్డులో ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు. 

 

 

 దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డ్ ఉండగా... 6,10,17,18,19,22,25,28 వార్డులలో  జనరల్ మహిళ,4,11,12,20,21 వార్డు లో బీసీ మహిళ, ఒకటో వార్డు ఎస్సి మహిళ,5,24  వార్డులు ఎస్సీ జనరల్, 27 వ వార్డు ఎస్టీ జనరల్, 3,15,23,24,26 వార్డులలో బీసీ జనరల్ .2 7 8 9 13 16 వార్డు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు ప్రకటించారు. 

 

 

 పోచారం మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డ్ ఉండగా అందులో 1,10,14 బిసీ జనరల్..  2 8 17 బీసీ మహిళ.. 5, 6, 9, 12 జనరల్, 7,11,13,15,18 జనరల్  మహిళలకు కేటాయించారు. 

 

 

 నాగారం  మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ పదవిని జనరల్ కు రిజర్వు చేయబడినవి. మున్సిపాలిటీలోని ఇరవై వార్డులకు గాను... 4, 10,20 బీసీ మహిళ, 1,2,14,19 బీసి జనరల్, 5,6,7,8,9,10,11, 12 జనరల్ మహిళ, 6,13,15,17 జనరల్ కు  కేటాయించారు, 

 

 

 దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనరల్  కు రిజర్వు చేయగా... మున్సిపాలిటీలోని 18వ వార్డులో... ఒకటో వార్డు ఎస్టీ జనరల్,  నాలుగో వార్డు ఎస్సి జనరల్,  2 ఎస్సీ మహిళ,  4,9,18 బీసి జనరల్, 3,5,8 బీసీ మహిళ,  7,10,12,14,17 జనరల్ మహిళ,  11,13,15,16 జనరల్ గా  కేటాయించారు. 

 

 

 తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్గా జనరల్ కు రిజర్వు చేయగా మున్సిపాలిటీలోని 16 వార్డు లో... పదో వార్డు ఎస్టీ జనరల్,  13 ఎస్సీ మహిళ, 02,08 ఎస్టీ జనరల్,14, 16 బీసీ మహిళ,  11,15 బీసి జనరల్, 1,3,6,7,12 జనరల్ మహిళ, 4,5,9 జనరల్  కు కేటాయించారు. 

 

 

 ఘట్కేసర్ మున్సిపాలిటీలో 18 వార్డులుండగా ... 18వ వార్డులో ఎస్టీ , 11, 12 ఎస్సి జనరల్, 7ఎస్సి మహిళ,  4,13,15 బీసి జనరల్, 10, 14 బీసీ మహిళ,  1,9,17 జనరల్, 2,3,5,6, 8,16 జనరల్ మహిళలకు కేటాయించారు. 

 

 

 గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు చైర్మన్ పదవిని జనరల్ మహిళ కు రిజర్వు చేయగా  మున్సిపాలిటీలోని 15 వార్డులకు గాను... అయితే 5 ఎస్సి జనరల్, 7 ఎస్సీ మహిళ,  6,13 బీసి జనరల్,  1,8 బీసీ మహిళ,  2,3,4,9 జనరల్ మహిళ,  11,12,14, 15 జనరల్ కు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: