మనలో అనేకమంది సమర్ధులు ఉన్నా వారి సమర్ధతను డబ్బుగా మార్చుకునే తెలివి తేటలు ఉన్న వాళ్ళు చాల తక్కువగా ఉంటారు. అలాంటి తెలివి తేటలు ఉన్న వారికి మాత్రమే శ్రీమహాలక్ష్మి కరుణ లభిస్తుంది. పరిసరాల ప్రభావం చిన్నప్పుడు అనుభవించిన దారిద్రయం తల్లి తండ్రుల ఆర్ధిక పరిస్థితి మన ఆలోచన సరళీ ఈ విషయాలు అన్నీ ప్రభావితం చేస్తూ ఒక వ్యక్తిని ధన వంతుడుగాను పేదవాడుగాను మారుస్తాయి. 

ఒక వ్యక్తి ధనవంతుడుగా మారాలి అంటే తాను చేసే పని జీవనోపాది కోసం చేస్తున్నట్లుగా భావించకుండా తన ఆనందం కోసం ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్న పనిగా భావించిన వారికే ఐశ్వర్యం వస్తుందనీ అయితే ఇలా ఎదగడానికి ప్రతి వ్యక్తికి ఒకే రకమైన ప్రణాళిక ఉండదు. డబ్బు సాధించాలి అన్న లక్ష్యంతో ప్రతి వ్యక్తి తనకు తానుగా తనకు అనువైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ప్రయత్నించినప్పుడు మాత్రమే ఐశ్వర్యం వస్తుంది కానీ శక్తికి మించిన లక్ష్యాలు పెట్టుకుంటే ధనం దరికి రాదు సరికదా దారిద్ర్యం పట్టుకుని పీడిస్తుందనీ సంపద రహస్యాలు తెలిసిన వారు చెపుతూ ఉంటారు.

ఆర్ధికంగా విజయం సాధించిన చాలామంది జీవితాలను చాల లోతుగా పరిశీలిస్తే వారి ప్రతి విజయం వెనుక కృషితో పాటు సమయస్పూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం రాత్రింబవళ్ళు కష్టపడినంత మాత్రాన డబ్బు రాదనీ సంపద సొంతం చేసుకోవాలి అంటే ఒక క్రీడలో రాణించాలి అంటే ఎంత ప్రావీణ్యత ఉండాలో డబ్బు గణించాలీ అన్న కోరిక ఉన్న వారికి సమయస్పూర్తి చాల అవసరమవీ కార్య సాధకులు చెపుతూ ఉంటారు.

‘మనం వద్దు అనుకున్నా వచ్చేది వయసు మనం రమ్మని చాల తెలివిగా వచ్చేది సంపద’ అన్న ఒక సామెత ఉంది. దీనితో శక్తివంతమైన సంపద సూత్రాలు తెలిసిన వాడే విజేత కాగలుగుతాడు. చిన్న పిల్లలను పెంచడానికి ఎంత సహనం కావాలో డబ్బు కావాలి అని భావించే వారికీ అంతకు మించిన సహనం ఉండాలి సహనం లేకుంటే ధనవంతులు కాలేరు..  

మరింత సమాచారం తెలుసుకోండి: