ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా నిన్న అనగా జనవరి 5వ తారీఖున నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ భూమి పూజ కి వెళ్ళిన సమయంలో ఒక వర్గం వైసిపి కార్యకర్తలు ఆమె కారుపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు హుటాహుటిన ఆ దాడిని అణచివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఎమ్మెల్యే  ఆర్ కె రోజా సెల్వమణి మాట్లాడుతూ.. అమ్ములు వైఎస్ ఆర్ సిపి కార్యకర్తలు ఆమె కారులో ఉండగా దాడి చేశారని ఆరోపించారు. ఒక సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే దాడి చేయడానికి ఒడిగడతారా? మహిళా ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని ఆమె ఈ కార్యకర్తలపై మండిపడ్డారు. వాళ్ళు దాడి చేసిన వీడియో ఫుటేజ్ ను కూడా ఆమె పోలీసులకు అందించారు. అలాగే ఈ దాడి గురించి ఆమె లక్ష్మణమూర్తి అనే పేరు గల ఒక కార్యకర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించగా... హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో దాడి చేసిన వారిపై 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.


ఇకపోతే గత ఎన్నికలలో అమ్ములు వర్గం కార్యకర్తలు తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. ఈ దాడిని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పారు. అదేవిధంగా ఈ దాడి వెనక ముఖ్య నేతల హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మరొకవైపు అమ్ములు వర్గ కార్యకర్తలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోజా సరిగా పనులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టి... టిడిపి కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: