సరిగ్గా స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బయటపడిన అసమ్మతి సమస్య ఎంఎల్ఏ రోజాకు పెద్ద షాకనే చెప్పాలి. ఎప్పటి నుండో నివురు గప్పిన నిప్పులాగ ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపడటంతో రాజకు ఇబ్బందిగా మారింది. గ్రామ సచివాలయం భవనం నిర్మాణం విషయంలో తలెత్తిన విభేదాలు ఆదివారం ఒక్కసారిగా బయడపడ్డాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గంలోని కేవిబి పురం మండలంలో నిర్మించాల్సిన గ్రామ సచావాలయం భవనం శంకుస్ధాపనకు రోజా దళితవాడకు వచ్చారు. ఆ సందర్భంగా మండలంలోని ఓ బలమైన నేత నేతృత్వంలోని కార్యకర్తలు, బంధువులు ఎంఎల్ఏ కారుకు అడ్డంపడ్డారు. ఊహించని రీతిలో ఎదురైన సమస్యతో ముందు రోజా బిత్తరపోయారు. తర్వాత వెంటనే తేరుకున్నారు లేండి.

 

విచిత్రమేమిటంటే ఎన్నికల సమయంలో బాగానే ఉన్న నేతల్లో  తర్వాత గొడవలు మొదలైంది. ఎన్నికల్లో కేవిబి పురం మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్ధాయిలో ఓట్లు రాలేదని రోజా భావన. అందుకు ఇపుడు కారుకు అడ్డుపడిన నేతే ప్రధాన కారణమని ఎంఎల్ఏ బలంగా అనుకుంటున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా టిడిపి నుండి కొందరు నేతలను చేరదీశారు.

 

దాంతో టిడిపి నుండి చేరిన నేతలకు, మొదటి నుండి ఉన్న నేతలకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందులో భాగంగానే  గ్రామసచివాలయం భవనం నిర్మాణం కూడా వ్యతిరేక వర్గం సూచించినట్లు దళితవాడలోనే కడుతున్నారని అసమ్మతి నేత అనుమానించటంతోనే  సమస్య పెరిగిపోయింది. సరే కారుకు అడ్డుపడిన వారిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు లేండి.

 

సరే సమ్మతి-అసమ్మతి వర్గాల వాదన ఎలాగున్నా మరి కొద్ది రోజుల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఏ జిల్లా ఏ సామాజికవర్గానికి కేటాయించారనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించేసింది. ఇటువంటి నేపధ్యంలోనే  రాజాకు వ్యతిరేకంగా అసమ్మతి బహిరంగంగా బయటపడటమన్నది సంచలనంగా మారింది. మరి ఎన్నికల్లోపు సర్దుబాటు చేసుకుంటే ఎంఎల్ఏకే మంచిది. లేకపోతే  జరిగే నష్టానికి ఆమే బాధ్యత వహించాల్సుంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: